సచివాలయంలో జరిగిన అగ్నిప్రమాదం ఓ పెద్ద కుట్ర అని, అది వైఎస్ ఫ్యాక్షనిజానికి నిదర్శనమని ఆరోపణలు వస్తున్నాయి... అవన్నీ పక్కన పెడితే.... అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు ఎంత బాధ్యతా రాహిత్యంతో వ్యవహరిస్తున్నారో... తెలియజెప్పే విషయం ఒకటి బయటపడింది.
ఏ కంపెనీలో అయినా, చిన్న ఆఫీసు అయినా... ఎంత చిన్న ప్రమాదం అయినా మనం వెంటనే స్పందిస్తాం. అది మనిషి సాధారణ స్పందన. అటువంటిది సచివాలయంలో, అది కూడా అన్ని జాగ్రత్తలు ఇది ఓ పత్రకలో వచ్చింది.
‘‘ మధ్యాహ్నం రెండు గంటల సమయంలో భోజనానికి ఇద్దరమూ వెళ్లాం. తొలుత పొగ వస్తుండటంతో చిన్న ప్రమాదమని భావించి తలుపు దగ్గరగా పెట్టి భోజనం చేశాము. ఆ తరువాత తలుపు తీయడానికి వెళ్లగా పొగ ఎక్కువైంది. మంటలు లేచాయి. ఊపిరాడటానికి ఇబ్బందిగా మారింది. బయటకు వెళ్లేందుకు ప్రయత్నించాం. ఏమి జరుగుతోందో అర్థంకాలేదు. అప్పుడే ఓ కానిస్టేబుల్ అద్దాలు పగులగొట్టి కాపాడాడు.’’
శ్రీమన్నారాయణ, అమర్.. సచివాలయం ఉద్యోగులు. పొగలు వస్తున్నపుడు ఏం జరిగిందో చూడాలన్న మినిమమ్ సెన్స్ లేకుండా... తాపీగా భోజనం చేశారట.. ఇటువంటి ఉద్యోగులు, బద్దకస్తులు మన అధికారులు. ఏం చేస్తాం కానీయండి.!
Friday, May 8, 2009
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
ఈ వార్త గనుక నిజమే అయితే వారిద్దరినీ కాపాడిన కానిస్టేబుల్ దే తప్పు. వారి ఖర్మానికి వాళ్ళని వదిలేయాల్సివుండింది. అప్పుడు బాగా బుద్ధివచ్చేది వారిద్దరికీ.
Post a Comment