Saturday, May 23, 2009

రెండు వారాల్లో స్వదేశీ వయాగ్రా


త్వరలో మన దేశీయ వయాగ్రా మార్కెట్లోని రానుంది. వనమూలికలతో తయారుచేసిన ఈ హెర్బల్‌ వయాగ్రాను తమిళనాడు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సంస్థ తయారుచేసింది. 'లబూబ్‌ సగీర్‌' పేరిట ఈ హెర్బల్‌ వయగ్రాను మరో రెండు వారాల్లో మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నట్లు తమిళనాడు మెడిసినల్‌ ప్లాంట్‌ ఫార్మ్స్‌ అండ్‌ హెర్బల్‌ మెడిసన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(టీఏఎంపీసీఓఎల్‌) మార్కెటింగ్‌ మేనేజర్‌ జి.రామనాథన్‌ తెలిపారు. ''విదేశీ వయాగ్రా 100 మిల్లీ గ్రాముల ప్యాకెట్‌ను రూ.150కి విక్రయిస్తే.. మేం 100 గ్రాముల ప్యాకెట్‌ను కేవలం రూ.50కే అమ్మనున్నాం'' అని ఆయన తెలిపారు.

No comments: