Sunday, March 7, 2010

ఓ అనంతపురం రైతు విజయ బాట

Thursday, February 4, 2010

వయసు - శృంగారం : ఎందుకు వ్యతిరేకం ?

అతనిలో శృంగార సామర్థ్యం సన్నగిల్లుతుంది. ఆమెకు సెక్సంటే ఆసక్తి చచ్చిపోతుంది. ఎప్పుడో ఒకసారి, ఇద్దర్లో ఎవరో ఒకరు చొరవ తీసుకున్నా... అంతా వెుక్కుబడి! ఈ నడివయసు సంక్షోభానికి మనసును మించిన మందులేదంటారు సెక్సాలజిస్టులు.

అతడు...
శృంగార యోధుడు. శోభనపు పెళ్లికొడుకు హోదాలో హారతులు అందుకున్నది వెుదలు, రతీమన్మథక్రీడలో రాటుదేలిపోయాడు. నిత్య ప్రయోగశీలి. వాత్స్యాయనాన్ని బట్టీపట్టాడు. ఓటమి ఎరుగని విజేత. ఆమెను గెలిపించి తనూ గెలుస్తాడు.

ఆమె...
శృంగార రసాధిదేవత. పట్టెమంచపు పట్టువిడుపులు తెలిసిన నేర్పరి. అతడిని కవ్విస్తుంది. నవ్విస్తుంది. ఉడికిస్తుంది. ఊరిస్తుంది. భీతహరిణంలా కనిపించే ఆడపులి!
పడకగది...
నాలుగుగోడల సామ్రాజ్యం. కొన్నిసార్లు ఆమె రాణి, ఆదేశిస్తుంది. అతను దాసానుదాసుడు, శిరసావహిస్తాడు.
కొన్నిసార్లు అతను రారాజు, కనుసైగచేస్తాడు. ఆమె దాసి, మనసెరిగి మురిపిస్తుంది.
వెుత్తంగా ఆ పడకగది ఓ వలపుబడి. అక్కడ, ఎక్కాల విషయంలో గణితశాస్త్రం కూడా తప్పులో కాలేస్తుంది. ఎందుకంటే, ప్రతిరాత్రీ రెండు ఒకట్లు ఒకటే అవుతాయి మరి.
అచ్చంగా పాఠ్యపుస్తకంలో చెప్పినట్టే విజాతి ధృవాలు గాఢంగా ఆకర్షించుకుంటాయి కాబట్టి, భౌతికశాస్త్రం సగర్వంగా మీసాలు మెలేస్తుంది.
అర్థశాస్త్రంలోని డిమాండు-సప్త్లె సూత్రం ఆ జంటకి అతికినట్టు సరిపోతుంది. ఎక్కడ తేడా వచ్చినా మిగిలేది 'అసంతృప్తే'.
ఆలూమగల్ని చూసి తెలుగు గ్రామరు తెల్లవెుహం వేస్తుంది. ద్విత్వాక్షరాలూ సంయుక్తాక్షరాలూ ఆ దగ్గరితనానికి కుళ్లుకు చస్తాయి. సవర్ణదీర్ఘసంధిలా మూడువందలఅరవై అయిదు రాత్రులూ సుదీర్ఘాలే. రతీమన్మథులు, నాయికానాయకులు, దిండూదుప్పటి...అక్కడన్నీ ద్వంద్వ సమాసాలే.

ప్రస్తుతం...
అతని జోరు తగ్గింది. హోరు మాయమైంది. పోరులో సర్వంకోల్పోయిన సర్వసైన్యాధ్యక్షుడిలా డీలాపడిపోయాడు. ఆమె వలచి వచ్చినా, వద్దని ముడుచుకుపోతాడు.

'బాగా అలసిపోయాను'

'పొద్దున్నే మీటింగ్‌ ఉంది'

'ఆఫీస్‌ టెన్షన్స్‌'

...అతని సాకులు!

ఆమె సొగసు మసిబారింది. కొంటెచూపు పదును తగ్గింది. నడక లయతప్పింది. ఆడతనం జాడకోల్పోయింది. ఆలింగన చుంబనాదులకు కూడా స్పందించలేని జడత్వమేదో ఆవరించింది.

'తలనొప్పిగా ఉంది'

'మూడ్‌ బావోలేదు'

'ప్లీజ్‌...వద్దు!'

...ఆమె తప్పించుకునే మార్గాలు.

ఆ నిర్లిప్తతకు కారణం నడివయసు గండం. నలభై, నలభై అయిదు మధ్య వెుదలయ్యే సరికొత్త సంక్షోభం. లైంగిక సామర్థ్యం సన్నగిల్లిపోవడం, బంగారంలాంటి శృంగార జీవితం మెల్లమెల్లగా డొల్లబారిపోవడం, వయసుతో వచ్చిన అయస్కాంతశక్తి క్రమంగా నీరసించడం... ఆ సమస్య లక్షణాలు.

మంచానికి అతను తూర్పయితే, ఆమె పడమర. ఆమె పడమరైతే, అతను తూర్పు. ఎవరో స్కేలుతో గీసినట్టు, ఇద్దరి మధ్యా సన్నని విభజన రేఖ. తుడిచేసుకోవాలని ఉన్నా తుడిచెయ్యలేని అశక్తత, ఎడబాటును శాశ్వతం చేసే తడబాటు.

ఆ పడకగది ఎప్పుడో కళతప్పిపోయింది. వూయలై వూగిన మంచం, నిశ్శబ్దాన్ని భరించలేక కొయ్యబారిపోయింది. ఆ గోడలు గుసగుసలు విని ఎన్నాళ్త్లెందో.

అంతేనా, సగం జీవితం శృంగారం లేకుండానే తెల్లారిపోవాల్సిందేనా? వలపు వూట పూర్తిగా ఎండిపోయినట్టేనా? అయినా, ఆ మదనుడికిదేం మాయరోగం?

నీరసపడాల్సిన పన్లేదు, నడివయసు సంక్షోభాన్ని గట్టెక్కడం సాధ్యమేనంటారు సెక్సాలజిస్టులు. అయితే, అదంత సులభం కాదు. అలా అని కష్టమూ కాదు. ఒళ్లుగుల్లచేసే మద్యం, ధూమపానం, మాదకద్రవ్యాలు...వంటి దురలవాట్లను గెలవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటుచేసుకోవాలి. దుష్పరిణామాలకు కారణమయ్యే హైపర్‌టెన్షన్‌, మధుమేహం తదితర సమస్యల్ని నియంత్రించాలి. ఆశావాదంతో హార్మోన్ల ప్రభావానికి అడ్డుకట్టవెయ్యాలి. మరీముఖ్యంగా, మనసును నిత్యయవ్వనంగా ఉంచుకోవాలి.
పదహారేళ్ల మనసు...
'డాక్టర్‌! లైంగిక సామర్థ్యం పెరగడానికి ఏదైనా మందుంటే ఇవ్వండి' అని అడిగాడో నడివయసు రసికుడు.

'తప్పకుండా. కానీ అది దుకాణాల్లో దొరకదు. ఏ శాస్త్రవేత్తా తయారు చేసివ్వలేడు. మీకు మీరే సృష్టించుకోవాలి' చెప్పాడు డాక్టరు. అదేమిటో అతనికి అంతుపట్టలేదు.

'ప్రేమ'...

ప్రిస్క్రిప్షను పేపరు మీద రాసిచ్చాడు డాక్టరు.

నిజమే, ప్రేమను మించిన ఔషధం లేదు. ప్రేమను మించిన కావోద్దీపన సాధనం లేదు. ఇద్దరి మధ్యా ఉన్న ప్రేమ, వేయి వయాగ్రాలకు సరిసమానం. ఒకర్నొకరు గాఢంగా ప్రేమించుకునే దంపతుల్లో వయసుతో సంబంధం లేకుండా, సెక్స్‌ హార్మోన్లు ఉత్పత్తి అవుతాయని పరిశోధనల్లో వెల్లడైంది. 'లవ్‌ అండ్‌ సర్వైవ్‌: సైంటిఫిక్‌ బేసిస్‌ ఫర్‌ హీలింగ్‌ పవర్‌ ఆఫ్‌ ఇంటిమసీ' రచయిత డీన్‌ ఆర్నిష్‌ దాదాపు పదివేలమంది దంపతుల్ని అధ్యయనం చేసి మరీ ఈ విషయం చెప్పారు. లైంగిక సమస్యలే కాదు, హృద్రోగం, క్యాన్సర్‌ వంటి తీవ్ర అనారోగ్యాల విషయంలోనూ 'ప్రేమ' మంచి ఔషధంగా పనిచేస్తుందని సదరు రచయిత చెబుతున్నారు.

కానీ, నాలుగుపదుల వయసులో ప్రేమను వ్యక్తం చేసుకునే తీరిక ఎక్కడిది? అసలు నడివయసంటేనే బోలెడన్ని అపోహలు, లెక్కలేనన్ని భయాలు, వోయలేనన్ని బాధ్యతలు, భరించలేనంత అభద్రత. అన్నీ కలిసి ఆ జంట శృంగార జీవితాన్ని సమస్యలపాలు చేస్తాయి. వయసుతోపాటు వచ్చే అనారోగ్యం...ఆ అనారోగ్యం వోసుకొచ్చే వైఫల్యాలూ పడకగది ప్రయత్నాల్ని అపహాస్యం చేస్తున్న సమయంలోనే...కెరీర్‌ సంక్షోభమూ వెుదలవుతుంది.

వృత్తి ఉద్యోగాల్లో కొత్తతరం పోటీకి వస్తుంది. సమకాలీన సాంకేతిక పరిజ్ఞానంతో, తాజా సమాచారంతో, కొండంత ఉత్సాహంతో, తమనుతాము నిరూపించుకోవాలన్న తపనతో రంగప్రవేశం చేసే ఆ కుర్రాళ్లు అతిపెద్ద సవాలై నిలుస్తారు. చాలా సందర్భాల్లో యాజమాన్యం ఓటూ వాళ్లకే పడుతుంది. తప్పదు, పోటీపడాలి. వెనకబడితే వెనకేనోయ్‌. ఏదో ఒకరోజు కొడుకు వయసో, కూతురి వయసో ఉన్న పిల్లల ముందు చేతులుకట్టుకు నిలబడాల్సిన పరిస్థితి వచ్చినా రావచ్చు. మెనోపాజ్‌, ఆండ్రోపాజ్‌ లక్షణాలనదగ్గ మతిమరుపు, ఏకాగ్రత లోపించడం, చికాకు, అసహనం...పర్సనల్‌ రికార్డులో ఎర్ర గుర్తులవుతాయి. ప్రవోషన్‌ ప్రయత్నాలకు గండికొడతాయి. టెస్టోస్టెరాన్‌ తగ్గుదల కారణంగా రిస్క్‌ తీసుకోగల సత్తా తగ్గిపోతుంది. అభద్రత పెరుగుతుంది.

పోటీ ప్రపంచంలో మనుగడ కోసం పోరాటం సాగించే స్త్రీపురుషులిద్దరికీ ఇలాంటి సవాళ్లు తప్పవు. వృత్తిజీవితంలోని 'అసమర్ధత' ముద్ర పడకగదిలోనూ ప్రశాంతంగా ఉండనీయదు. ఆ ఒత్తిడి మధ్య సెక్స్‌ ఆలోచనలు చచ్చిపోతాయి.

హౌసింగ్‌ లోన్‌, కార్‌ లోన్‌, పర్సనల్‌ లోన్‌, ఫారిన్‌ట్రిప్‌ లోన్‌... జీతానికి కోత విధించే వాయిదాలకు పిల్లల పైచదువుల ఖర్చులూ తోడవుతాయి. బుర్రనిండా అప్పుల కుప్పలే, ఆర్థిక సమస్యలే. శృంగార భావనలకు చోటెక్కడిది? చేతికొచ్చిన పిల్లల్ని ఇంట్లిో పెట్టుకుని, పడక సుఖానికి వెంపర్లాడటం తప్పేవో అన్న అపరాధ భావనొకటి. ఒకటిరెండుసార్లు, దొంగల్లా దొరికిపోయి తలదించుకున్న అనుభవాలూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే, మనసు వయసుకు మించి ముసలిదైపోతుంది. ఆలూమగలు బలవంతపు వృద్ధాప్యాన్ని కొనితెచ్చుకుంటారు.

అదే జీవిత భాగస్వామి. అవే అనుభవాలు. పాతికేళ్ల కాపురం తర్వాత శృంగార జీవితం పాతబడిపోయినట్టు అనిపిస్తుంది. సెక్స్‌ వెుక్కుబడి వ్యవహారంగా మారిపోతుంది. అన్నేళ్లూ రంభలా వూరించిన శ్రీమతిలో మెరుపు మాయమైపోయిన భావన. అతని బానకడుపు, బట్టతల ఆమెలోని వోహాన్ని చిదిమేస్తాయి. ఒకరికొకరు ఆకర్షణీయంగా కనిపించాలనే తపన చచ్చిపోతుంది. ఇలాంటప్పుడే, శృంగారానికి శరీరం సహకరించినా మనసు వెురాయిస్తుంది. ఈ స్తబ్దతనూ నిరాసక్తతనూ గెలవడానికి ఓ మంచి ఔషధముంది. దాని పేరు...మనసు!

'అక్షరాలా నిజం. శృంగారం మనసుతో వెుదలవుతుంది. మనసుతోనే ముగుస్తుంది. నడివయసే కానివ్వండి. ఆరుపదులే కానివ్వండి. వయసును గెలవలేం. అది మన చేతుల్లో లేదు. కానీ, ఒత్తిడిని జయించగలం. అది మన చేతుల్లోనే ఉంది. ఆఫీసులో ఏవో ఇబ్బందులు ఉండవచ్చు. వృత్తి జీవితంలో ఇంకేవో సమస్యలు ఉండవచ్చు. ఆఫీసు, ఇల్లు...రెండూ వేరువేరు ప్రపంచాలని మరచిపోకూడదు. పాదరక్షల్ని బయటే విప్పేసి ఇంట్లోకెళ్లినట్టు, ఒత్తిడిని వదిలేసి పడకగదిలోకి ప్రవేశించండి. జీవిత భాగస్వామి ముందు ముసుగులొద్దు. భయాలొద్దు. సంకోచాలొద్దు. మనసు విప్పి మాట్లాడండి. కావలసింది అడగండి. అడిగింది ఇవ్వండి. వయసుదేముంది? వస్తేరానీ...యాభై, అరవై...' అని ధైర్యం చెబుతారు ప్రఖ్యాత సెక్సాలజిస్టు ప్రకాశ్‌ కొఠారి.

'పెర్ఫార్మెన్స్‌ యాంగ్జయిటీ'... తమ సామర్థ్యం మీద తమకున్న అపనమ్మకం, సగం జంటల్ని సమస్యలపాలు చేస్తుంది. అలాంటి సమయంలో జీవిత భాగస్వామి పాత్ర చాలా ముఖ్యం. చేతల ద్వారా, మాటల ద్వారా ఒకరికొకరు ధైర్యం నింపే ప్రయత్నం చేయాలి. అసలు జీవిత భాగస్వామితో లైంగిక విషయాలు మాట్లాడేవారి సంఖ్య సగానికంటే తక్కువేనని సెక్స్‌ సర్వే-2009 చెబుతోంది. ఇద్దరి మధ్యా సాన్నిహిత్యం పెరిగితే, నడివయసు ప్రభావం చాలావరకు దూరమైపోతుంది.
వయస్కాంత శక్తి...
మగవాడు ఆశావాది. లక్షణమైన ఉద్యోగం పోయినా లెక్కపెట్టడు. తన అర్హతకు తగిన కొలువు వెతుక్కుంటూ వస్తుందని నమ్ముతాడు. ఆస్తిపాస్తులన్నీ కరిగిపోయినా కుంగిపోడు. సున్నానుంచయినా వెుదలుపెట్టగలనన్న ధీమా. పడకగదిలో మాత్రం, ఏ చిన్న వైఫల్యం ఎదురైనా తట్టుకోలేడు. గిజగిజలాడిపోతాడు. మగసిరి సంపదల్ని ఎవరో దోచుకుపోయినట్టు బాధపడతాడు.

రాజేంద్రదీ దాదాపు అలాంటి పరిస్థితే. నిన్నవెున్నటిదాకా తిండిలా, నిద్రలా, శ్వాసలా...శృంగారం అతని జీవితంలో భాగం. ఆఫీసులో ఎన్ని పనులున్నా చకచకా చక్కబెట్టుకుని ఎనిమిదింటికంతా ఇంటికొచ్చేస్తాడు. తప్పనిసరై క్యాంపులకెళ్లినా అర్ధరాత్రి అయ్యేసరికి టకటకమని తలుపుతడతాడు. వచ్చితీరతాడని ఆమెకు తెలుసు. ఆమె ఎదురుచూస్తుంటుందని అతనికీ తెలుసు.

పెళ్లయి పదిహేనేళ్లయినమాటే కానీ, ఏకాంతంలో మాత్రం ఇద్దరూ కొత్తదంపతులే. ఆమె చూపు చాలు, అతనికి మత్తెక్కించడానికి. అతని స్పర్శ చాలు, ఆమె కరిగిపోడానికి. ఆ పడకగదిలో ఇప్పుడు...ఉలుకుల్లేవు, పలుకుల్లేవు. గుసగుసల్లేవు, పదనిసల్లేవు.

ఆ స్తబ్ధతకు కారణం, అంగస్తంభన సమస్య. ఏకంగా శృంగార జీవితాన్నే స్తంభింపజేసింది. లేహ్యాలు వాడాడు. చిట్కాలు ప్రయోగించాడు. నపుంసకుడినైపోయానని నిర్ధారణకు వచ్చాడు. సమయానికి తిండి లేదు. నిద్రలేదు. ఆఫీసుకెళ్లినా పరధ్యానంగానే. అతణ్ని మామూలు మనిషిని చేయడమెలా?
పురుషుడితో పోలిస్తే స్త్రీ శృంగార పరమపదసోపానానికి ఒకటిరెండు మెట్లెక్కువ. ఆ ప్రక్రియ కాస్త సంక్లిష్టం కూడా. ముందు, ఆలోచన వెులకెత్తాలి. కోరిక పురులు విప్పాలి. శరీరం శృంగార రసాస్వాదనకు సిద్ధంకావాలి. నచ్చిన మనిషితో ఆ నెచ్చెలి కూడాలి. అప్పుడే తృప్తి, భావప్రాప్తి. ఆమె శరీరమెంత సున్నితవో, మనసు అంతకు పదిరెట్లు సున్నితం. ఒడుదొడుకులు లేనప్పుడే ఆ సుకుమారి శృంగార రసయాత్ర సాఫీగా సాగుతుంది. ఏ చిన్న అడ్డంకి వచ్చినా అనుభూతుల్ని ఆస్వాదించలేదు. మధ్యవయసు గృహిణి సుమలత సమస్యే తీసుకోండి. ఈమధ్య ఆమెకు సెక్సంటేనే వెగటుపుట్టింది. భర్త ఒంటిమీద చేయి వేసినా తేళ్లూ జర్రులూ పాకుతున్నట్టు అనిపిస్తుంది. నిరాశపరచడం ఇష్టంలేక, సరేనన్నా...భరించలేనంత నొప్పి. అదో నరకం. నిన్నటిదాకా రతీదేవిలా మురిపించిన శ్రీమతి... ఎందుకిలా ప్రవర్తిస్తోందో అతనికి అర్థంకావడం లేదు. సుమ కూడా మనసు విప్పే ప్రయత్నం చేయడంలేదు. ఫలితంగా ఏవో అపార్థాలు. సమస్య విడాకుల దాకా వచ్చింది. ఇప్పుడేం చేయాలి?

నడివయసు శృంగార జీవితం, నడిసముద్రంలో నావలాంటిది. ఆటుపోట్లెక్కువ. ఆలూమగలిద్దరూ తట్టుకుని ముందుకెళ్తేనే గట్టు చేరుకుంటారు. అందులోనూ అనారోగ్యం అన్నేళ్లుగా కాచుకు కూర్చునుంటుంది. నలభైదాటగానే అమాంతంగా దాడిచేస్తుంది. రక్తపోటులో తేడా వస్తుంది. రక్తంలో చక్కెర శాతం ఎక్కువ కనిపిస్తుంది. చాలాకాలంగా మద్యానికి అలవాటైనవారికి కాలేయ సమస్యలు బయటపడతాయి. వెన్ను నొప్పులు, కీళ్లనొప్పులు... ఏవో ఒకటి. అన్నీ శృంగార జీవితం మీద ప్రభావం చూపేవే.

నలభైదాటిన పురుషుల్లో యాభైరెండు శాతానికి పైగా అంగస్తంభన సమస్యతో బాధపడుతున్నట్టు అంచనా. అందుకు ప్రధాన కారణం మధుమేహమే. అధికరక్తపోటు కూడా తాత్కాలిక నపుంసకత్వానికి కారణమవుతుంది. కొలెస్ట్రాల్‌ పెరగడం వల్ల వచ్చే హైపర్‌లిపీడెమియా కూడా శృంగార సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. పక్షవాతం, మల్టిపుల్‌ స్ల్కెరోసిస్‌, పార్కిన్సన్స్‌, అల్జీమర్స్‌ వంటి వ్యాధులూ మగటిమిని మట్టికరిపిస్తాయి. ఈ సమస్యలన్నీ కట్టకట్టుకుని నడివయసులోనే వస్తాయని కచ్చితంగా చెప్పలేం కానీ, నలభై పైబడిన శరీరానికి మునుపటి వ్యాధి నిరోధకత ఉండదు. అందుకే సరిగ్గా ఆ సమయంలోనే రోగలక్షణాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. రక్తపోటు, గుండెజబ్బు తదితర రుగ్మతలకు వాడే మందులు కూడా అంగస్తంభన సమస్యలకు కారణం కావచ్చు. యాంటీ డిప్రెసెంట్స్‌ (డిప్రెషన్‌కు వాడే మందులు) లైంగిక సామర్థ్యానికి సవాలు విసురుతాయి. అయినా భయపడాల్సిన పన్లేదు. శృంగారానికి శాశ్వతంగా దూరం కానవసరంలేదు. దాదాపు 90 శాతం లైంగిక సమస్యల్ని మందులతో నయం చేయవచ్చని భరోసా ఇస్తారు సెక్సాలజిస్టులు. 'పురుషుల్లో చాలావరకు శారీరక కారణాలవల్లే లైంగిక సమస్యలు వస్తుంటాయి. కానీ, ఒత్తిడివల్లో టెన్షన్స్‌ వల్లో తమ సామర్థ్యం సన్నగిల్లిందని సర్దుకుపోయేవారే ఎక్కువ' అంటారు ఆండ్రాలజిస్ట్‌ సుధాకర్‌ కృష్ణమూర్తి.

నడివయసు మహిళల్లో...సెక్స్‌ మీద ఆసక్తి తగ్గిపోవడం, భావప్రాప్తి సమస్య, జననేంద్రియాలు పొడిబారిపోవడం, భరించలేనంత నొప్పి తదితర సమస్యలు కనిపిస్తాయి. పురుషుడి వైఫల్యానికి కారణమైన అనారోగ్యాలే ఆమెనూ బాధిస్తాయి. రక్తపోటు, మధుమేహం, మానసిక వ్యాధులు, గర్భాశయ సమస్యలు, ఇన్ఫెక్షన్లు... ప్రత్యక్షంగానో పరోక్షంగానో స్త్రీ జడత్వానికి కారణం కావచ్చు. పురుషుల్లో అయినా, స్త్రీలలో అయినా లైంగిక సమస్యల్ని తేలిగ్గా తీసుకోడానికి వీల్లేదు. కొన్నిసార్లు అవి ఏ హృద్రోగానికో పక్షవాతానికో సంకేతాలు కావచ్చని హెచ్చరిస్తున్నారు వైద్యనిపుణులు.
ార్మోన్ల దాగుడుమూత
...ఆ ఆనందం రోజూ కావాలని పోరే చిలిపి శ్రీవారికి రసికాగ్రేసరుడంటూ పూలకిరీటం తొడగలేం. పక్షానికోసారి ముచ్చట తీర్చుకునే వెుక్కుబడి భర్తని బొత్తిగా సరసం తెలియని మనిషని ఈసడించుకోనూలేం. తహతహలాడినా తలతిప్పుకు పడుకున్నా...అంతా హార్మోన్ల మహత్యం! నడివయసు మనుషులంటే వాటికెందుకో చిన్నచూపు. కోతలు విధించి కష్టాలపాలు చేస్తాయి. ఆ ఫలితమే మగవారిలో ఆండ్రోపాజ్‌, మగువల్లో మెనోపాజ్‌. మెనోపాజ్‌తో స్త్రీ సంతాన సామర్థ్యం కోల్పోతుంది. ఆండ్రోపాజ్‌ పురుషుడికి ఆ ఇబ్బందేం ఉండదు. కాకపోతే, టెస్టోస్టెరాన్‌ ఉత్పత్తి క్రమక్రమంగా పడిపోతుంది. అతనిలోని పురుషత్వానికి ప్రతీక ఆ హార్మోనే. రోషం, తెగువ, గాంభీర్యం... అన్నీ టెస్టోస్టెరాన్‌ ఇచ్చిన కానుకలే. దాని ఉత్పత్తి తగ్గిపోయిందంటే, అతనిలోని శృంగారశక్తీ సన్నగిల్లుతున్నట్టే.

ఈస్ట్రొజెన్‌, ప్రొజెస్ట్రాన్‌ తదితర హార్మోన్లు స్త్రీ జీవితాన్ని మార్చేస్తాయి. ఆమెను మెనోపాజ్‌దశకు తీసుకెళ్తాయి. సెక్స్‌ హార్మోన్ల ఉత్పత్తి మందగించడంతో ఆమెలో శృంగారేచ్ఛ తగ్గుముఖం పడుతుంది. కానీ సెక్స్‌ ఆలోచనలు మాత్రం ఉంటాయి. కాబట్టే, మెనోపాజ్‌ా అంటే, శృంగార జీవితానికి రిటైర్మెంట్‌ లాంటిదని అనుకోడానికీ వీల్లేదు.

వయసు కంటే, హార్మోన్ల ఉత్పత్తి కంటే...'జీవితంలోని నాణ్యత' మన శృంగార సామర్థ్యం మీద అపారమైన ప్రభావం చూపుతుంది. యవ్వనం నుంచే చక్కని ఆహార అలవాట్లు, క్రమంతప్పని వ్యాయామం, ఆరోగ్యకరమైన అలవాట్లు, పాజిటివ్‌ దృక్పథం అలవరచుకుంటే... ఆండ్రోపాజ్‌, మెనోపాజ్‌ లక్షణాల తీవ్రత నామమాత్రంగా ఉంటుందని పరిశోధనలు నిరూపించాయి.
నలభై దాటాయంటే...యువకుల్లో వృద్ధులు, వృద్ధుల్లో యువకులని అర్థం. ఎన్ని మందులు వాడినా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆ దశలో పాతికేళ్ల వయసులోని తహతహ ఉండకపోవచ్చు, ముప్ఫైలలోని సామర్థ్యం సన్నగిల్లొచ్చు. కోరిక పురులు విప్పకపోవచ్చు. తలచుకోగానే తనువు సహకరించకపోవచ్చు. అది సహజం. పరిణామక్రమంలో ఓ భాగం. ఏ వయసుకాపరుగు. ఏ పరుగుకా ఆనందం. ఆ సూక్ష్మం గ్రహిస్తే చాలు. నడివయసు పడకజీవితం నిశ్చింతగా సాగుతుంది.

'శృంగారమంటే శారీరకంగా ఏకం కావడం ఒక్కటే కాదు, మానసికంగా దగ్గర కావడమన్నదీ చాలా ముఖ్యం. దానికి లైంగిక సామర్థ్యంతో పన్లేదు' అని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఆ దగ్గరితనం కోసం ఆరాటపడినంతకాలం, ఏ హార్మోన్లూ ఆలూమగల పడకల్ని వేరుచేయలేవు. ఆ జంట రెండో హనీమూన్‌కు ఏర్పాట్లు చేసుకోవచ్చు.


ఇలా...గెలవాలి!

యోగా

యోగాతో నడివయసు సంక్షోభాన్ని సులభంగా గట్టెక్కవచ్చు. యోగాసనాలు శరీరంలోని ఎండోక్రైన్‌ వ్యవస్థను క్రమబద్ధీకరించి, లైంగిక సామర్థ్యాన్ని పెంచే హార్మోన్ల ఉత్పత్తికి సహకరిస్తాయని అధ్యయనాల్లో వెల్లడైంది. జానుశీర్షాసనం, వజ్రాసనం, సర్వాంగాసనం... తదితర ఆసనాలు శృంగార సామర్థ్యాన్ని రెట్టిస్తాయని నిపుణులు చెబుతున్నారు. యోగా అనే కాదు... వ్యాయామం, నడక, ఏరోబిక్స్‌ ఏదో ఓ వ్యాపకం తప్పకుండా ఉండాలి.
ధ్యానం

ధ్యానం మనసుకు కళ్లెమేస్తుంది. ఆలోచనల మీద అదుపు సాధించిపెడుతుంది. ఆ అనుభవం పడకగదిలోనూ పనికొస్తుంది. అతనికి ఆమె. ఆమెకు అతను. ఇద్దరూ ఒక్కటయ్యే క్షణంలో... ఆఫీసు చికాకులూ వ్యాపార లావాదేవీలూ బుర్ర సందుల్లోంచి తొంగిచూడవు. మనసును గెలిచినవారికి మదనసామ్రాజ్యాన్ని గెలవడం పెద్ద కష్టమేం కాదు!
ఆహారం

ఎంత పిండికి అంత రొట్టె. ఎంత తిండికి అంత శక్తి. మనం తినే భోజనంలో విటమిన్లు, ప్రొటీన్లు, పీచుపదార్థాలు సమృద్ధిగా ఉండాలి. అందులోనూ...అల్లం, వెల్లుల్లి, ఉల్లి, మునగ, ఇంగువ తదితరాల్లో శృంగార సామర్థ్యాన్ని పెంచే గుణాలు ఉన్నట్టు ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి. సోయా మెనోపాజ్‌ తీవ్రతను తగ్గించగలదని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. ఓట్స్‌లోని ఔషధగుణాన్నీ ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు.
అలవాట్లు

అలవాట్ల ప్రభావం పడకగదిలోనూ కనిపిస్తుంది. మద్యం, ధూమపానం, ఓ పద్ధతంటూలేని భోజన విధానం, వ్యాయామంలేని శరీరం, హద్దుల్లేని తిరుగుళ్లూ తద్వారా వచ్చే వ్యాధులు...అన్నీ కలిసి శృంగార జీవితాన్ని సర్వనాశనం చేస్తాయి. మంచి అలవాట్లు ఉన్నవారే, పడకగదిలోనూ మంచి భాగస్వామి అనిపించుకోగలరు.
ఏకాంతం

ఓ వయసుకు వచ్చేసరికి భార్యాభర్తలకు వ్యక్తిగత జీవితమంటూ లేకుండా పోతుంది. చేతికొచ్చిన పిల్లలు, వాళ్ల చదువులు, పుస్తకాలు, ఫారిన్‌ ప్రయాణాలు, పెళ్లిళ్లు... ఆ బాధ్యతల నడుమ పుట్టినరోజులు, పెళ్లిరోజులు కూడా గుర్తుండవు. అది సరికాదు. ఆలూమగలకు 'మాదీ' అన్న ఏకాంత ప్రపంచం ఉండితీరాలి. ఏడాదికో వారం రోజులు... ఇద్దరే చెట్టాపట్టాలేసుకుని ఏ కొడైకెనాల్‌కో వెళ్లిరావచ్చు. ఎన్ని పనులున్నా తీరిక చేసుకుని చిలిపి ఎస్సెమ్మెస్‌లు ఇచ్చిపుచ్చుకోవచ్చు. వారాంతాల్లో రొమాంటిక్‌ మూవీస్‌కు వెళ్లొచ్చు. ఆ సాన్నిహిత్యం శృంగార జీవితాన్ని ఉత్సాహభరితం చేస్తుంది.
వైద్యం

నూటికి ఎనభైమంది లైంగిక సమస్యల్ని బయటికి చెప్పుకోడానికి ఇష్టపడరు. డాక్టరు దగ్గరికెళ్లడానికి సాహసించరు. ఏవో భయాలూ అపోహలూ. ఈ దశాబ్దకాలంలో లైంగిక వైద్యం అపారంగా అభివృద్ధి చెందింది. కొత్తకొత్త మందులు, శస్త్రచికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. అంగస్తంభన సమస్య, శీఘ్రస్కలనం, తాత్కాలిక నపుంసకత్వం వంటి నడివయసు సమస్యల నుంచి బయటపడటం పెద్ద కష్టమేం కాదు.

___ writer: karanam janardan rao
___ cortesy : EENADU sunday

Sunday, January 3, 2010

హాలెండ్‌ అమ్మాయి.. తెలుగు భాష

సేవకు, మానవత్వానికి హృదయం ఉండాలి. ప్రాంతంతో సంబంధం ఏముంది... అన్న ఆలోచనే హాలెండ్‌ అమ్మాయి హెన్రికాను అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్‌కి వచ్చేలా చేసింది. తునికి దగ్గర్లోని చామవరంలో ఏ ఆసరాలేని వందమంది చిన్నారులకు ఆశ్రమం నిర్మించే స్ఫూర్తినందించింది.ఆటలు, పాటలు, విందు, వినోదాలతో కాలక్షేపం చేయాల్సిన వయసులో అసలిక్కడికి రావడానికి ఏమిటి ప్రేరణంటే... ఆమె నేపథ్యం, మనసులోనిసేవా భావనని చెప్పక తప్పదు.
అమ్మ ప్రభావంతో...
తల్లిదండ్రుల ప్రభావం పిల్లలపై ఉంటుందన్నది ఈమెకి అతికినట్టు సరిపోతుంది. హెన్రికా తల్లి అక్కడ ఓ స్వచ్ఛంద సంస్థలో కౌన్సెలర్‌. మత్తు మందుల వాడకానికి చిన్నారులను దూరంగా ఉంచేందుకు కృషి చేస్తోంది. తండ్రి ఒక సంస్థలో ఉన్నతోద్యోగి. చిన్నప్పట్నుంచి హెన్రికాకు పిల్లలంటే ప్రాణం. తల్లి సేవా కార్యక్రమాలను దగ్గర్నుంచి చూసీ ఎంతో ఆనందపడేది. ఆర్నెల్ల క్రితం డిగ్రీ పూర్తిచేసి ఇంట్లో ఖాళీగా ఉన్న హెన్రికా త్వరగా యూనివర్సిటీలో చేరాలని తపన పడింది. సరిగ్గా ఆ సమయంలోనే... తల్లి స్నేహితురాలు లిండా వాళ్లింటికి రావడంతో ఆమె ఆలోచనలు దారి మళ్లాయి. ముందు సేవ, చదువు తరవాత అన్న తీరు కనబరిచేలా చేశాయి.

సేవే మిన్న
కొన్ని వారాల వ్యవధిలో హెన్రికా ఇండియా రావాలన్న నిర్ణయం జరిగిపోయింది. అదెలాగో ఆమె మాటల్లోనే చదవండి. 'తునిలో ఆశీర్వాద్‌ అనాథాశ్రమం ఉంది. దాన్లో వందమంది పిల్లలున్నారు. వారి వసతికి, చదువుకి మనం ఏదయినా చేస్తే బావుంటుంది అని లిండా ఆంటీ అమ్మతో చెప్పింది. అప్పటికే అక్కడికెళ్లొచ్చిన ఆంటీ అక్కడి పరిస్థితులు, చేయాల్సిన కార్యక్రమాలపై చాలాసేపు మాట్లాడింది. అప్పుడుతట్టింది నాకొక ఆలోచన. ఖాళీగా కూర్చోవడం కన్నా ఆ మంచి పనిలో నేనెందుకు భాగస్వామ్యం తీసుకోకూడదు అని. అమ్మతో చెప్పా. మొదట చదువుకో తరవాత అలాంటి పనులకు వెళుదువు గానీ అంది. యూనివర్సిటీలో చేరేందుకు ఇంకా ఏడాది సమయముంది. ఆ లోపు ఈ సేవా కార్యక్రమంలో పాలుపంచుకొంటానని ఒప్పించా' అంటూ క్రితం ఆగస్టులో జరిగిన విషయాలను పూసగుచ్చింది హెన్రికా.

పిల్లల కోసం తెలుగు...
కాలేజీలో సమావేశాలు, స్టేజీ షోలతో చిన్న మొత్తాల సమీకరణ ప్రారంభించింది. బంధుమిత్రులు, అమ్మానాన్నల సహోద్యోగుల నుంచి ఆర్థిక సహకారం కోరింది. సమకూరిన మొత్తంతో నాలుగు నెలల క్రితం తుని చేరుకుంది. ఆమె వెంట నాన్న, లిండా ఆంటీ. వచ్చీ రాగానే చిన్నారుల్లో ఒకరుగా కలిసిపోయిన ఆమె వసతి గృహం నిర్మాణానికి సన్నాహాలు ఆరంభించింది. 'వచ్చిన కొత్తలో ఇక్కడి వారి గురించి ఏమీ తెలియదు. కానీ అక్కా అంటూ ఆప్యాయంగా అక్కున చేరడం నన్ను కదిలించింది. అంత దూరం నుంచి నేనిక్కడికి రావడం వందశాతం మంచి నిర్ణయం అని అర్థమైంది' అంటోన్న ఆమె పిల్లలతో మమేకమై ఆడిపాడి చేరువయ్యేందుకు పట్టుబట్టి మూడు నెలల్లో తెలుగు భాష నేర్చుకొంది. చీరకట్టు అలవాటు చేసుకుంది.

మరో వంద మందికి నీడ...
పదిమంది పిల్లలతో 2003లో ఆరంభమైన ఆశీర్వాద్‌లో నేడు వందమంది పిల్లలున్నారు. తునిలో అద్దె భవనమే వారికి నీడ. చదువు, వసతి, నిర్వహణ కోసం భారీ ఖర్చే. ఈ పరిస్థితుల్లో దగ్గర్లోని చామవరంలో శాశ్వత వసతి గృహం కోసం హెన్రికా ముందుకు రావడం కొండంత వూరట. ఉదయం నుంచి సాయంత్రం వరకూ దగ్గరుండి నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న హెన్రికా చీకటిపడ్డాక పిల్లలకు ఆంగ్లం నేర్పిస్తోంది. మొదట్లో ఆహారం సరిపడక ఇబ్బందిపడినా ఇప్పుడు పిల్లలందరితో కలిసి చక్కగా భోంచేస్తోంది. మరో ఐదారు నెలల్లో భవన నిర్మాణం పూర్తిచేసి స్వదేశానికి వెళతానంటున్న ఆమె చదువు పూర్తయ్యాక మరిన్ని సేవా కార్యక్రమాలకు మద్దతునందిస్తానని చెబుతోంది. ఈ టీనేజీ అమ్మాయి సేవా స్ఫూర్తితో అక్కడున్న వంద మంది చిన్నారులకే కాదు... మరో వందమంది బాలలకూ ఆశ్రయం అందించే ఏర్పాటు కలగనుండటం విశేషం.

courtesy- eenadu

Friday, January 1, 2010

కొత్త ఫోన్లు వచ్చాయి !


సాక్షి మంచి పని చేసింది. మార్కెట్లో ఎ ఫోన్ కొంటె బాగుంటుందో తెలియక ఇబ్బంది పడుతున్న నా కష్టాలను సులువుగా తీర్చింది. ఇదే కాదు. ఈ మధ్య బిజినెస్ పేజ్ చాల బాగుంటుంది. వీకెండ్ ఎడిషన్ లో మంచి మంచి స్టోరీలు వస్తున్నాయి. ఈరోజు ఇచ్చిన కొత్త ఫోన్ల వివరాలు చదవండి

Monday, December 21, 2009

మీ ప్రయాణ అనుభవాలు మాకు పంపండి !

మీ ప్రయాణ అనుభవాలు, మధురిమలు అందరితో పంచుకోవాలని ఉందా ఐతె మాకు పంపండి. చక్కటి విశేషాలు ఉన్న వాటిని సాక్షి లో ప్రచురిస్తాం. రంగుల ఫొటోల్లొ మీ తీపి అనుభూతులను అందరితో పంచుకోండి.

సాక్షి ఫ్యామిలీ లొని ట్రావెలోగ్ ద్వారా మీ అనుభవాలు పంచుకోవలనుకుంటే
కాల్ చేయండి

ప్రకాష్
సీ.సబ్ ఎడిటర్
సాక్షి
9912199593

Friday, December 18, 2009

మీ జీతంలో కోతలు తగ్గించుకోండి !!




mee jeetam pannula gurinchi telusukodaaniki indulo needed info undi. telusukuni jaagratha padandi.


Saturday, December 12, 2009

స్టైల్ కి అరవై సంవత్సరాలు !!

సూపర్‌స్టార్‌ యారున్ను కేట్టాళ్‌ చిన్న పొణ్ను సొల్లుమ్‌... (సూపర్‌స్టార్‌ ఎవరని అడిగితే చిన్న పాపాయి చెబుతుంది) - తమిళనాట రజనీకాంత్‌ అభిమానులకు ఇష్టమైన వాక్యాలివి. వెండి తెరపై సూపర్‌స్టార్‌ రజనీ అని అక్షరాలు కనిపించగానే టెంకాయలు పగలడం... పుష్పాభిషేకం జరగడం సర్వసాధారణ విషయాలు. ఆయన సినిమా ఎప్పుడాని లక్షల హృదయాలు ఎదురుచూస్తుంటాయి. అంతగా ఏముంది ఆయనలో...?
'సినిమాల్లోకి రావాలంటే గ్లామరే ముఖ్యం' అనుకుంటే ఆయనసలు హీరోనే కాకూడదు. మెరుపు వేగంతో చిందులేసేవాడే కథానాయకుడు అనుకుంటే రజనీకి అందులోనూ పాస్‌ మార్కులే! ఆకర్షించే రూపం... ఆరడుగుల ఎత్తే కొలమానాలైతే ఆయన ఎప్పటికీ శివాజీరావ్‌ గైక్వాడ్‌గానే మిగిలిపోయేవాడు.

మరి ఏముంది ఆయనలో..? మళ్లీ అదే ప్రశ్న. దానికి సమాధానం కొన్ని కోట్ల రజనీ అభిమానులకు తెలుసు. అదే - స్త్టెల్‌..! అదే ఆయన్ని సూపర్‌స్టార్‌ని చేసింది. దక్షిణభారతంలోనే కాదు... ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న ఆయన నేడు అరవయ్యో యేట అడుగుపెడుతున్నారు.

ఔను... సింహం సింగిల్‌గానే వస్తుంది. అచ్చం రజనీకాంత్‌లాగే. 'రైట్‌.. రైట్‌..'- ఈ కండక్టర్‌ స్త్టెల్‌గా భలే చెబుతున్నాడే... - ఈ ఒక్క ప్రశంసే అతన్ని ప్రభంజనం సృష్టించడానికి తొలి అడుగు వేసేలా చేసింది. ఓ నాటకంలో దుర్యోధనుడిగా వేషం వేస్తే లభించిన ఆదరణ... అతని దృష్టి సినిమా రంగంవైపు మరల్చేలా చేసింది. ఒంటరిగా రంగుల లోకంలోకి వచ్చిన ఆయన బాలచందర్‌ దగ్గర నేర్చుకొన్న పాఠాలు బతుకు గమనంలో బాటలుపరచాయి. ఆ తర్వాత వెనక్కు తిరిగి చూసుకునే సమయమే చిక్కలేదు.

సిగరెట్‌ని గాలిలో రెపరెపలాడించి... పెదవులతో అందుకోవడం. కళ్లజోడుని గిర్రున తిప్పి అలంకరించుకునే విధానం.. ఇవన్నీ ప్రేక్షకులకు కొత్త అనుభూతి మిగిల్చాయి. ఆయన నవ్వులో... మాటలో.. నడకలో ఏదో గమ్మత్తు ఉంది. కథానాయకుడంటే నృత్యాలూ... పోరాటాలూ మాత్రమే చేస్తాడనుకునే వారికి రజనీ శైలి కొత్త రుచులు పంచింది. పంచ్‌ డైలాగులతో మంత్రజాలం చేయడం వింతగా అనిపించింది. అప్పటి నుంచి రజనీ సినిమా అంటే ఇవి ఉండాల్సిందే అని అభిమానులు ఆశించారు... రజనీ పాటించాడు.

ఇంత బడ్జెట్టా?
అరవయ్యో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న రజనీకాంత్‌ ఇప్పటికే ఎన్నోసార్లు సినిమాలకు స్వస్తి చెప్పాలనుకొన్నారట. అయితే ఎప్పటికప్పుడు ఏదో శక్తి ఆయన్ని సెల్యులాయిడ్‌ వైపు లాగుతూనే ఉంది. తొలి దశలో సహాయ పాత్రలూ, ప్రతినాయక పాత్రలూ పోషించిన రజనీ స్థాయి ఇప్పుడేమిటో తెలుసా... మన దేశంలోనే అత్యధిక వ్యయంతో నిర్మితమయ్యే చిత్రంలో కథానాయకుడు కావడం. ఆయన తాజా చిత్రం 'రోబో'కయ్యే ఖర్చు రూ.120 కోట్లు పైమాటే! ఓ ప్రాంతీయ భాష నటుడికి ఈ స్థాయి ఎలా వచ్చింది. ఒకటే కారణం... రజనీ సినిమా అంటే కొన్ని నెలలు ముందుగానే సందడి మొదలైపోతుంది. అభిమానులు వసూళ్లూ... రికార్డులూ అనే లెక్కలు వేసేసుకుంటారు. 'మన సినిమాని వాయిదా వేసుకుంటే మంచిది' అని దక్షిణ భారతాన నిర్మాతలు భావిస్తారు. రజనీ క్రేజ్‌ అలాంటిది. 'శివాజి' విడుదలైనప్పుడు దేశవ్యాప్తంగా ఒకటే చర్చ... ఓ ప్రాంతీయ భాషా చిత్రానికి ఇంత క్రేజా..? అని బాలీవుడ్‌ సైతం ముక్కున వేలేసుకుంది. మనదేశంలోనే కాదు... అమెరికా, కెనడా, సింగపూర్‌, చైనా, జపాన్‌ లాంటి దేశాల్లోనూ అభిమాన గణముంది. కాబట్టే పారితోషికం తీసుకోవడంలోనూ రజనీ నెంబర్‌ వన్‌.

నటన కూడా నటనే!
లెక్కలేనంతమంది అభిమానులు... పురస్కారాలు... ఇవేమీ రజనీలోని లోపలి మనిషిని తృప్తి పరచలేదు. 'మీరు పాత్రలో జీవించారు' లాంటి మాటలు రజనీ చెవులు అస్సలు భరించలేవు. 'ఇలాంటి మాటలు వింటుంటే నవ్వొస్తొంది. నేను డబ్బులు తీసుకొని నటిస్తాను. నటించడం నా పని. అంతే- దాని కోసం ఎప్పుడూ నా మనసు లగ్నం చేయలేదు. నా నటన కూడా నటనే' అని ఒప్పుకొనే గుండె ధైర్యం ఎంతమందికి ఉంది? ఓ వెస్పా స్కూటరు... జేబు నిండా సిగరెట్లు.. ఓ సింగిల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు.. శివాజీరావ్‌ కోరుకున్నవి ఇవే. కానీ వీటికి కొన్ని వేల రెట్లు సంపాదించారు రజనీకాంత్‌. కానీ ఏదో అశాంతి. 'నా' అనే స్వార్థం వదిలి హిమాలయాలకు వెళ్లిపోవాలనే ఆలోచనలు అప్పుడప్పుడూ ఆయన్ని వెంటాడుతుంటాయి.

నిరాడంబరంగా...
రజనీకాంత్‌కి బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ అంటే ఇష్టం. ఈ మధ్యనే 'పా' చిత్రం చూస్తూ కన్నీళ్లుపెట్టుకున్నారు. ''అమితాబ్‌తో కలిసి 'అంధా కానూన్‌', 'గిరఫ్తార్‌' లాంటి చిత్రాల్లో నటించాను. నేను ఆయన అభిమానిని. ఎందరో విదేశీ నటుల్ని కూడా పరిశీలించా. కానీ అమితాబ్‌ శైలి వేరు. 'పా' లాంటి చిత్రం ఆయన మాత్రమే చేయగలరు'' అన్నారు. రజనీ షష్టిపూర్తి వేడుకల్ని ఘనంగా చేయాలని అభిమానులు భావించారు. అలాగే ఆయన కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య... కనీసం బంధుమిత్రుల సమక్షంలోనైనా చేయాలని ఎన్నో ప్రణాళికలు వేసుకున్నారు. అయితే రజనీ చిరునవ్వుతో వాటిని వద్దన్నారని తెలిసింది. అయినా ఈ వేడుకల్ని నిరాడంబరంగా చేసే అవకాశాలున్నాయి. శనివారం ఆయన 'రోబో' చిత్రీకరణలో పాల్గొంటారు.

Friday, November 20, 2009

రావు గారి భావుకత

గాంధీ అంటే వాడికి ఇస్టం
గాంధీ బొమ్మ ఉన్న నోట్ల కోసం
ఏమైనా చేస్తాడు



మగవాడికి స్త్రీ
అర్థాంగి కాదు
పూర్ణాంగి !

- ఇవి బి.రావు గారి రచనలు
for more visit : www.brao.wordpress.com

Tuesday, October 27, 2009

స్త్రీ పరివేదన- శృంగారానుభూతి

ఒకప్పుడు ఎంతో హాయినిచ్చి.. సజావుగా సాగిన దాంపత్య జీవితమే ఒక్కోసారి అనూహ్యంగా ఇబ్బందుల్లో పడొచ్చు! శృంగారానుభూతి బాధాకరంగా మారితే దైనందిన జీవితంలో ఆనందం కరవై, అసంతృప్తి రగులుకొంటుంది. చాలామంది స్త్రీలు లైంగికపరమైన ఇబ్బందుల గురించి భాగస్వామితో చెప్పుకోటానికీ, చర్చించటానికే సంశయిస్తుంటారు. ఇక వీటి గురించి వైద్యులతో చర్చించి చికిత్స తీసుకోవటమంటే.. మన సమాజంలో ఎంతోమంది స్త్రీలకు బిడియం, బెరుకు, నగుబాటు! అందుకే ఈ సమస్య నేడు మరింత జటిలంగా తయారైంది.

నిజానికి దంపతులు ఇరువురిలో ఏ ఒక్కరు అసంతృప్తికి లోనవుతున్నా సెక్స్‌ అన్నది సమస్యగా పరిణమిస్తుంది. దాంపత్య జీవితంలో అప్పుడప్పుడు 'విజయాలూ, వైఫల్యాలూ' సహజం. అలాగే ఎంత తరచుగా సెక్స్‌లో పాల్గొంటున్నారన్నది కూడా జంటకూ, జంటకూ మారిపోవచ్చు. ఉదాహరణకు ఒక జంటకు తరచూ సంభోగంలో పాల్గొనకపోయినా పెద్ద సమస్యగా అనిపించకపోవచ్చు. కానీ అదే మరో జంటలో.. (లేదా ఇద్దర్లో ఎవరో ఒకరికి) తీవ్ర అసంతృప్తిని మిగులుస్తూ పెద్ద ఇబ్బందిగానూ తయారవ్వచ్చు. పురుషులలో మాదిరిగానే.. స్త్రీలలో కూడా లైంగిక సమస్యలకు ఎన్నో అంశాలు కారణమవుతాయి. వీటిలో మానసికసమస్యలే ఎక్కువగా ఉండొచ్చుగానీ శారీరకమైన సమస్యలు కూడా దీనికి కారణమవుతాయని గుర్తించటం అవసరం. ఒకప్పుడు స్త్రీల లైంగిక సమస్యలన్నింటినీ కూడా చాలావరకూ మానసిక ఇబ్బందులుగా కొట్టిపారేసేవారు. అయితే తాజా అధ్యయనాలు అది సరికాదని, దీని వెనక శారీరక కారణాలు కూడా ఎక్కువే ఉంటాయని కచ్చితంగా నిర్ధారించాయి. మధుమేహం, గుండెజబ్బులు, కొన్ని రకాల మందులు కూడా స్త్రీలలో లైంగిక సమస్యలను తెచ్చిపెట్టొచ్చు.

ఆ బాధ పురుషులకే కాదు.. స్త్రీలకూ ఉంటుంది! ఆ ఇబ్బంది.. స్త్రీలనూ వేధిస్తుంది. అసలు వాంఛలే కలగకపోవచ్చు. కోర్కె కలిగినా శృంగారం చెప్పలేనంతటి అసౌకర్యంగా మారచ్చు. తృప్తి కానరాకపోవచ్చు. మొత్తానికి దాంపత్య జీవితమే ఇబ్బందిగా తయారవ్వచ్చు! దాదాపు 40% స్త్రీలు లైంగికంగా ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే ఇప్పుడు వైద్య ప్రపంచం స్త్రీల లైంగిక సమస్యల మీద మరింత నిశితంగా దృష్టి సారిస్తోంది. వివరాలు ఈ వారం ప్రత్యేకం!


'వాంఛ' జటిలం
లైంగిక వాంఛలు అస్తవ్యస్తం కావటం.. ఎంతోమంది స్త్రీలు ఎదుర్కొనే అతిపెద్ద, సర్వసాధారణ సమస్య. దీని గురించి భాగస్వామితో చర్చించకపోతే అసంతృప్తి, మానసిక వ్యథ మరింతగా పెరుగుతాయి. అలసట, మానసిక కుంగుబాటు, ఒత్తిడి, రకరకాల ఇతర జబ్బులు, భాగస్వామితో సత్సంబంధాలు లేకపోవటం, మద్యానికి బానిస కావటం.. ఇవన్నీ కూడా వాంఛలు సన్నగిల్లేలా చేసి, సెక్స్‌ జీవితాన్ని దెబ్బతీస్తాయి. అలవాటైన గర్భనిరోధక పద్ధతిని మార్చుకున్నా, కొన్ని రకాల మందులు వాడుతున్నా, నెలసరి నిలిచిపోయే వయసు దగ్గపడుతున్నా.. స్త్రీలలో లైంగిక వాంఛలు కొంత తగ్గచ్చు. అలాగే రుతుచక్రంలో కొన్నికొన్ని రోజుల్లోనూ, కాన్పు అయిన తర్వాత కొంతకాలం పాటు శృంగార వాంఛలు తక్కువగా ఉంటాయి. కారణమేదైనా వైద్యపరిభాషలో దీన్ని 'ఇన్‌హిబిటెడ్‌ డిజైర్‌ డిజార్డర్‌' అంటారు. లైంగిక సమస్యలతో వైద్యుల వద్దకు వస్తున్న స్త్రీలలో దాదాపు 80% మందిలో ఏదో స్థాయిలో ఈ సమస్య ఉంటోంది! ఈ సమస్య ఉన్న స్త్రీలలో కొందరు.. సెక్స్‌ పట్ల తక్షణ ఆసక్తి, తక్షణ వాంఛలు లేకపోయినా.. భాగస్వామి లైంగిక పరిచర్యలకు క్రమేపీ బాగానే స్పందిస్తారు, ఆ తర్వాత వాంఛలు, భావప్రాప్తి వంటివన్నీ సహజంగానే అనుభవిస్తారు. మరికొందరు.. భాగస్వామి పరిచర్యలకు ఏమాత్రం స్పందించకపోగా విముఖంగా కూడా ఉండొచ్చు. లైంగిక వాంఛలు తక్కువగా ఉన్నవారు.. భాగస్వామితో సాన్నిహిత్యాన్ని కోరుకుంటూనే సంభోగాన్ని మాత్రం అంతగా ఇష్టపడకపోవచ్చు. భావోద్వేగపరమైన ఈ వైరుధ్యాలు, గందరగోళాలన్నీ కలిసి దాంపత్య జీవితంలో వ్యథకూ, తీవ్రమైన అసంతృప్తికీ కారణమవుతుంటాయి.

చి కామవాంఛలు తిరిగి వికసించేలా చెయ్యటానికి 'సెక్స్‌ థెరపీ' బాగా ఉపకరిస్తుంది. సమస్యల గురించి దంపతులు ఇరువురూ చర్చించుకునేలా ప్రోత్సహిస్తూ.. శృంగారంలో సరికొత్త పద్ధతులు అనుసరించేలా చెయ్యటం ద్వారా దీన్ని అధిగమించవచ్చు. లైంగిక వాంఛలు లేకపోవటం (లాస్‌ ఆఫ్‌ డిజైర్‌), లైంగిక ప్రేరణలు తక్కువగా ఉండటం (లో సెక్స్‌ డ్రైవ్‌).. ఈ రెంటి మధ్యా చాలామంది గందరగోళపడే అవకాశం ఉంది. హార్మోన్ల మార్పులు, థైరాయిడ్‌ సమస్యల వంటి శారీరక కారణాలన్నీ కూడా స్త్రీలలో లైంగిక ప్రేరణలను తగ్గించవచ్చు. వైద్యపరమైన పరీక్షల ద్వారా అసలు సమస్య- వాంఛలు లేకపోవటమా? లేక ప్రేరణలు లేకపోవటమా? అన్నది నిర్ధారించవచ్చు. ఏమైనా ప్రస్తుతం దీనిపైన విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. స్త్రీలలో కామ వాంఛలను తిరిగి పునరుత్తేజింపజేసే ఔషధాల కోసం మందుల కంపెనీలు కూడా బాగా కృషి చేస్తున్నాయి.

నొప్పి బాధాకరం
సంభోగ సమయంలో నొప్పి, బాధ అన్నది రెండు రకాలుగా ఉండొచ్చు.ఒకటి శారీరకంగా అంతర్గత కారణాలకు సంబంధించినది. రెండోది- పైపైని సమస్యల వల్ల వచ్చేది! అంతర్గతమైన నొప్పి- సంభోగ సమయంలో యోని వద్ద స్రావాలుతగినంత లేకపోవటం వల్ల రావచ్చు,కటిప్రాంత అవయవాల్లో వాపు (పెల్విక్‌ ఇన్‌ఫ్లమేటరీ) వల్ల రావచ్చు, ఎండోమెట్రియోసిస్‌ వంటి శారీరక సమస్యల్లో కూడా రావచ్చు. సాధారణంగా సంభోగ సమయంలో- పురుషాంగ ప్రవేశం, కదలికలు సౌకర్యవంతంగా సాగేందుకు లోపల గర్భాశయం కొద్దిగా పైకి వెళ్తుంది, యోని పెదవులు కొద్దిగా ఉబ్బుతాయి, ఇవన్నీ కూడా కామోద్దీపనం తగినంతగా ఉన్నప్పుడే సాధ్యపడతాయి. కాబట్టి తగినంత సంసిద్ధత లేకపోతే ఇవేమీ జరగక సంభోగం బాధాకరంగా తయారవుతుంది. ఇక పైపైని సమస్యల వల్ల వచ్చే నొప్పి చాలావరకూ- యోనిలో పూత, జననాంగ హెర్పిస్‌, యోని కండరాల వాపు, కండరాలు బలంగా బిగదీసుకుపోవటం వంటి వాటివల్ల వస్తుంది. కండోమ్‌లు సరిపడకపోవటం, గర్భనిరోధక క్రీములు, సాధనాలవంటి వాటివల్ల కూడా నొప్పి రావచ్చు. కొందరిలో నొప్పి ఓ మోస్తరుగానే ఉంటే మరికొందరిలో తీవ్రంగా ఉండి, మళ్లీ సంభోగమంటేనే భయపడే పరిస్థితి రావచ్చు. సంభోగ సమయంలో, లేదా ఆ తర్వాత- నొప్పి, మంట, గీరుకుపోయిన భావన.. ఇలా రకరకాలుగా ఉండొచ్చు. ఈ సమయంలో నొప్పిగా ఉన్నా, రక్తస్రావం అవుతున్నా తప్పనిసరిగా వైద్యులతో చర్చించి చికిత్స తీసుకోవాలి. దీనికి పరిష్కారంగా- భంగిమ మార్చుకోవటం, లూబ్రికెంట్లు, మందుల వాడకం వంటి రకరకాల మార్గాలు ఉపకరిస్తాయి. సెక్స్‌ బాధాకరంగా మారినప్పుడు చాలామంది స్త్రీలు అసలు సెక్స్‌ పట్లే అయిష్టత పెంచుకుంటారు. కొన్నిసార్లు నొప్పి తగ్గిపోయినా ఈ భావన మనసు నుంచి పోదు. అందుకే - దంపతులిరువురూ కలిసి అవగాహన పెంచుకోవటం, పుస్తకాలు చదవటం, అవసరమైతే సెక్స్‌ థెరపీ, కౌన్సెలింగ్‌ వంటివి తీసుకోవటం.. వంటివన్నీ ఉపకరిస్తాయి.
భావప్రాప్తి కలత
స్త్రీలలో భావప్రాప్తి గురించి ఎన్నో అపోహలు ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా అంగాంగ సంభోగంలో ప్రతి స్త్రీ భావప్రాప్తి పొందుతుందన్నది పెద్ద అపోహ! కేవలం 25% మంది మాత్రమే ఈ విధంగా భావప్రాప్తిని చేరుకుంటారనీ, మిగిలిన 75% శాతం మందికి అదనంగా ఎంతోకొంత యోనిశీర్ష ప్రేరేపణ (క్లిటోరల్‌ స్టిమ్యులేషన్‌) అవసరమని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే దాదాపు 12% స్త్రీలు అసలు ఎన్నడూ భావప్రాప్తినే పొందకపోవచ్చని కూడా అంచనా. చాలామంది స్త్రీలు భావప్రాప్తిని చేరుకోకపోయినా.. సంభోగ సమయంలో భాగస్వామితో సాన్నిహిత్యాన్నీ, తృప్తికరమైన అనుభూతినీ పొందుతారు. కాబట్టి భావప్రాప్తి కలగకపోవటమన్నది- దానికదేగా సమస్య కాదు, ఆమెకుగానీ, భాగస్వామిగానీ అదో సమస్యగా అనిపిస్తే తప్పించి! సరైన ప్రేరణలు లేకపోవటానికి శారీరక కారణాలు కూడా కారణమవుతాయనిఇప్పుడిప్పుడే అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా హార్మోన్ల అసమతౌల్యం, యోని శీర్షానికిగానీ, యోనికిగానీ రక్తసరఫరా తగ్గటం వంటివి దీనికి కారణం కావచ్చు.

భావప్రాప్తి అన్నది ఎన్నో అంశాలతో ముడిపడి ఉంటుంది. సెక్స్‌ పట్ల వారికి ఉన్న దృక్పథం, చక్కటి ప్రేరణ, మానసికంగా ప్రశాంతంగా సౌకర్యంగా ఉండటం, స్త్రీపురుషుల పట్ల నిర్దుష్టమైన భావనలుండటం.. ఇవన్నీ భావప్రాప్తిపై ప్రభావం చూపిస్తాయి. ఆందోళన, వ్యాకులత వంటివి భావప్రాప్తిని అడ్డుకోవచ్చు. ప్రస్తుతం భావప్రాప్తి కలగక, దాన్ని పొందాలని ఆశిస్తున్నవారిలో అవగాహన పెంచేందుకు ఇప్పుడు ఎన్నో పుస్తకాలున్నాయి, 'ప్రీ ఆర్గాస్మిక్‌' గ్రూపులు కూడా వీరి కోసం సమాచారాన్ని అందుబాటులో ఉంచుతున్నాయి. స్త్రీలు తమ శరీరంపై అవగాహన పెంచుకుని, తమకు తాము సాంత్వననిచ్చుకునేలా సెక్స్‌ థెరపిస్టులు తోడ్పడతారు. ముందుగా ఇలా తన స్పర్శకు తానే స్పందించటం అలవాటైన తర్వాత.. క్రమేపీ అదే అనుభూతిని భాగస్వామితో కూడా పంచుకునే అవకాశాలు పెరుగుతాయి.

అనూహ్య బిగతీత
కొందరికి సెక్స్‌ అంటేనే.. అసంకల్పితంగా యోని ప్రాంతం చుట్టూ ఉండే కండరాలన్నీ ఉన్నట్టుండి బిగదీసుకుపోతుంటాయి. దీన్నే 'వజైనిస్మస్‌' అంటారు. ఇలా కండరాలన్నీ బిగిసినప్పుడు అంగప్రవేశమే కష్టంగా మారుతుంది. దీనివల్ల దాంపత్య జీవితం అసాధ్యంగా పరిణమిస్తుంది. ఇలా అంగప్రవేశం కష్టమైనా కొందరు స్త్రీలలో కామోద్దీపనం, భావప్రాప్తి వంటి మిగిలిన దశలన్నీ బాగానే ఉంటాయి. సంభోగం మాత్రమే కష్టంగా తయారవుతుంది. దీనికి: సంభోగంలో బాధ, నొప్పి, తరచూ యోని ఇన్ఫెక్షన్లు, తీవ్రమైన మానసిక ఆందోళన, బాధాకరమైన గత అనుభవాలు, తగినంత యోని స్రావాలు లేకపోవటం.. ఇలాంటివన్నీ కారణం కావచ్చు. మొత్తానికి ఈ సమస్యకు చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి, దీన్ని అధిగమించేందుకు సైకోసెక్సువల్‌ థెరపిస్టులు సహాయపడతారు.

courtesy: EENADU telugu daily

Monday, August 24, 2009

ఓ సామాన్యుడి తెలివి.. 400 కే వాననీటి ఫ్యూరిఫికేషన్

A Bangalorean has de-bunked politicians' theory that one needs to go to other states to study implementation of rainwater harvesting. M Rajamurthi, an LIC agent, has created a unique system at his house. And his guide was the Bangalore Water Supply and Sewerage Board (BWSSB).

After two to three trials, he was successful in making a model that saved him over 10,000 litres of rainwater this monsoon.

Rajamurthi and his family were using a borewell and Cauvery water for their needs before he was struck with the idea of creating a rainwater system for himself. "I was shocked that ministers were going abroad to learn this. It is not a complicated one. All I spent on the pipes and filters was Rs 400 and that has saved me so much of water," he said.

What Rajamurthi did was to pick up an anniversary book of BWSSB that had several models of rainwater systems. He read the guidelines in detail and tried implementing it. The first model did not work. On a second trial, he got it right.

"I used two kinds of filters -- a 150 micron screen tea filter and a bucket tea filter. The water slopes from the terrace into a pipe and comes down to the filter. The solid residue settles at the bottom of the filter and water gushes up into the bucket where it filters again. The filtered water then comes down through a pipe and is collected in the underground sump," explained Rajamurthi.

For drinking purposes, 25 members residing in the three-storeyed house are still using Cauvery water, but Rajamurthi says rainwater has been purified enough to be used for drinking as well. The terrace area is 30 by 40 feet, which fulfils the description specified by BWSSB to come under mandatory rainwater systems.

BWSSB chairman P B Ramamurthy will visit Rajamurthi's house soon to see the model. On his part, Rajamurthi plans to start an NGO by employing plumbers who will be trained in making the system. Then he will fix it at other houses for Rs 100. "I have already fixed the system at four other houses and some houses at Bidadi and Ramanagaram,'' he said.