Sunday, May 3, 2009
కూరలు తరగడానికీ ఓ థియరీ
కూరలు తరిగే థియరీ
కూరలు తరగడానికి కూడా ఒక థియరీ చెప్పేడొక పాకశాస్త్ర ప్రావీణ్యుడొకసారి. కొన్నాళ్ళు పెద్ద ఎత్తులో – అంటే పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు లాటి వాటికి - వంటలు చెయ్యడం నేర్చుకొందామని ఓ పెద్దాయన దగ్గర శుశ్రూషకి కుదురుకొన్నా. ఆయన చెప్పిన రహస్యమేమిటంటే – కూరగాయలు రెండురకాలు. రమణారెడ్డిలా సన్నగా, పొడుగ్గా ఉండేవి ఒకరకం, రేలంగిలా బొద్దుగా ఉండేవి రెండోరకం. బొద్దుగా ఉండే కూరగాయలని (ఆనపకాయలు, దుంపలు, కాబేజి లాటివి) ముందు నిలువుగా కొయ్యాలి. ఒకసారి కోసిన తర్వాత కూడా ఇంకా రేలంగిలాగే ఉంటే – ఆ చిప్పని మళ్ళా నిలువుగానే కొయ్యాలి. ఎప్పుడైతే ఆ ముక్కలు రమణారెడ్డిలా అవుతాయో, అప్పుడు వాటిని అడ్డంగా నరుక్కోవాలి. కూరలు తరగడానికి బైనరీ సెర్చి అల్గార్థమ్ అనుకోండి.
note: ఇవి కాయలు, పువ్వులకు అంటే కాలీఫ్లవర్, మామిడికాయ వంటి వాటికి వర్తించవు అన్నమాట.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment