Monday, May 25, 2009

పురుషుల ఆరాధ్యుడు.. వయాగ్రా సృష్టికర్త మరణం..




పురుషుల ఆరాధ్యుడు.. వయాగ్రా సృష్టికర్త మరణం..

మగతనం కాపాడుకోలేక... పరువు పోగొట్టుకోలేక దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడే పురుషపుంగవులకు చీకటిలో వెలుగులా.. దారిచూపిన రాబర్ట్ ఫర్చ్ గాట్ పరమపదించారు. సియాటెల్లో తుదిశ్వాస వదిలిన ఫర్చ్ గాట్ వయసు 92 సంవత్సరాలు. వాతావరణానికి హాని చేసే వాయువుగా భావిస్తూ వచ్చిన నైట్రిక్ ఆక్సైడ్ శరీరంలో కీలక ప్రక్రియలక తోడ్పడుతుందని ఈయన తేల్చారు. ఆ కీలక ప్రక్రియల్లో ముఖ్యమైనది కామోద్దీపన. విచిత్రం ఏంటంటే వాతావరణ పరంగా పొగమంచు, ఆమ్లవర్షాలకు కారణమైన నైట్రిక్ ఆక్సైడ్ రక్తప్రసరణ వ్యవస్థలో కీలకంగా పనిచేస్తుందని ఆయన తన పరిశోధనల ద్వారా ప్రపంచానికి నిరూపించారు. ఈ పరిశోధనలే వయగ్రా తయారీకి దోహదపడ్డాయి. ఫర్చ్ గాట్ పుణ్యమా అని ప్రపంచవ్యాప్తంగా లైంగిక సమస్యలతో బాధపడే పురుషులకు వయాగ్రా వరంలా లభించింది. ఈ ఆవిష్కరణతో ఒక్కసారి మగతనం గట్టిగా ఊపిరి పీల్చి గర్వించింది. ఈయన పరిశోధనలకు నోబెల్ పరుగెత్తుకుంటూ వచ్చి ఒడిలో వాలింది
ఓం నమో ఫర్చ్ గాటాయ నమ:

1 comment:

హరే కృష్ణ said...

చనిపోయి మూడు రోజులు దాటుతోంది అనుకుంటా
కొసమెరుపు కుమ్మేసారు