Wednesday, April 29, 2009

డిగ్రీ లేని వారికీ ఉద్యోగం !


విప్రో బీపీఓలో డిగ్రీ లేనివారికీ ఉద్యోగం

ప్రస్తుత ఆర్థిక మాంద్య పరిస్థితుల్లోనూ విప్రో బిజినెస్‌ ప్రాసెస్‌ అవుట్‌సోర్సింగ్‌ (బీపీఓ) విభాగం ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది. వచ్చే 6-8 నెలల్లో హైదరాబాద్‌లోని విప్రో బీపీఓ కేంద్రంలో కొత్తగా 1,000-1,200 మందిని నియమించనున్నట్లు విప్రో బీపీఓ అధిపతి అశుతోష్‌ వైద్య తెలిపారు. ఇందుకు రాష్ట్రంలోను, చుట్టుపక్కల ప్రాంతాల్లోను ప్రత్యేక నియామకాలు చేపట్టనున్నారు. సాధారణ డిగ్రీ పొందిన వారితో పాటు పట్టభద్రులు కాని వారికి కూడా కంపెనీ అవకాశం కల్పించనుంది. హైదరాబాద్‌ విప్రో బీపీఓ కేంద్రంలో ప్రస్తుతం 3,150 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇక్కడ 8,000 మంది పని చేయడానికి సదుపాయాలు ఉన్నాయి. ఆంగ్లం మాట్లాడే సామర్థ్యం, కంప్యూటర్‌పై (హార్డ్‌వేర్‌) ప్రాథమిక అవగాహన ఉన్న వారికి ప్రవేశ పరీక్ష నిర్వహించి అర్హులైన వారిని కంపెనీ ఎంపిక చేస్తుంది. వీరికి మూడు నెలలపాటు శిక్షణ ఇస్తారు. శిక్షణ కాలంలో కూడా వేతనం చెల్లిస్తారు. ప్రారంభ వేతనం రూ.8,000 నుంచి రూ.12,000 ఉంటుంది. ప్రాంగణ నియామకాలు చేట్టడానికి విశ్వవిద్యాలయాలతో చర్చలు జరుపుతున్నామని, వెంకటేశ్వర, నాగార్జునా విశ్వవిద్యాలయాల్లో నియామకాల ప్రక్రియ చేపట్టడానికి తేదీలు ఖరారయ్యాయని విప్రో వైస్‌ ప్రెసిడెంట్‌ (టాలెంట్‌ ఎక్వజేషన్‌) ఇ.వి.ఎస్‌.సాయి బాబు తెలిపారు.

************** వీక్షకులకు విన్నపం: రాష్ట్రంలో గాని, దేశంలోగాని పేదలు, అనాథ పిల్లలకు ఉచిత విద్యను అందించే సంస్థల వివరాలు ఉంటే దయచేసి ఆ సమాచారాన్ని 9948299593 (ప్రకాష్, ఈనాడు) నెంబరుకు, ammaprema@yahoo.com మెయిల్ కు గాని తెలపగలరని మనవి.
**************

No comments: