Saturday, April 4, 2009

అవినీతి గురించి అబ్దుల్ కలాం సంచలన వ్యాఖ్య !




అవినీతి గురించి అబ్దుల్ కలాం సంచలన వ్యాఖ్య !


అసలు అవినీతి ఎక్కడ జరుగుతుందో తెలుసా? మన దేశంలో 100 కోట్ల జనాభా.... దాదాపు 20 కోట్ల కుటుంబాలున్నాయి. అవినీతి ఈ కుటుంబాల్లోనే ఏదో ఒకచోట ఉంటుంది. ఉదాహరణకు ఓ 30 శాతం కుటుంబాల్లో మొదలవుతోందని అనుకుందాం. ప్రతి ఇంటా తల్లి, తండ్రి, పిల్లలు.. ఇలా నలుగురైదుగురుంటారు. అవినీతి సహజంగానే పెద్దవాళ్లతో మొదలవుతుంది. దీన్ని కట్టడి చేయడానికి చట్టం ఉంది. కాని దానికి సమయం పడుతుంది. మరి అలాంటపుడు ఈ అవినీతిని ఎవరు నిర్మూలించాలి? అందుకే అంటున్నా.. యువతీయువకులంతా ఓ ఉద్యమం ఆరంభించాలని. ‘తప్పు చేయకండి.. అవినీతికి పాల్పడకండ’ని మీ తల్లిదండ్రులను కోరండి. అది చాలు, వారు తలదించుకునేలా చేయడానికి. తల్లిదండ్రులకు పిల్లలంటే ప్రేమ కాబట్టి వాళ్లు తప్పకుండా పిల్లల మాట వింటారు. కాబట్టి.. అవినీతి నిర్మూలనకు నా దృష్టిలో యువత ముందుకు వస్తేనే సాధ్యం. చట్టబద్ధంగా అవినీతి నిర్మూలన జరగాలంటే... చాలా టైం పడుతుంది.


vote india http://www.useurvote.com/

No comments: