Thursday, March 26, 2009
కాలాన్ని కొలవడంలో ఆసక్తికర నిజాలు
మీకోసం సేకరించిన కాలగణన సమాచారం నాబ్లాగులో పెడుతున్నాను. దీనికోసం ఎన్నాళ్లనుంచో వెతుకుంటే.. ఇప్పటికి దొరికింది.. మీరు కూడా తెలుసుకోండి. ముఖ్యంగా ఉగాది సమయంలో తెలుసుకోవడం బాగుంటుంది.
లేత తామరాకు వాడిగా ఉన్న గుండుసూదిని గుచ్చితే ఆ సూదిమొన తామరాకులో దిగడానికి పట్టే కాలాన్ని ‘కాష్ట’ అంటారు.
12 కాష్టలు = 1 తృటి
12 తృటులు = 1 కళ
20 కళలు = ఒక నిమిషం
24 నిమిషాలు = ఒక ఘడియ
2 1/2 ఘడియలు = 1 గంట
24 గంటలు = ఒకరోజు
............
కలియుగం = 4,32,000 సంవత్సరాలు
కలియుగానికి రెండు రెట్లు అంటే ద్వాపరయుగం, మూడురెట్లు అయితే త్రేతాయుగం, నాలుగురెట్లు అయితే కృతయుగం
.............
రుషుల పంచాంగం ప్రకారం సృష్టి మొదలై 195 కోట్ల 58 లక్షల 85 వేల, 110 సంవత్సరాలు గడిచింది.
.................
ఉగాది పండుగ నాడు సూర్యోదయానికి సరిగ్గా 48 నిమిషాలు ముందు నిద్రలేచి గాలి స్వేచ్ఛగా వీచే ప్రదేశంలో నీలాకాశాన్ని చూస్తూ నిలబడాలి. సూర్యుడి తొలికిరణాలు మన శరీరాన్ని తాకి శరీరం శక్తిమంతం అవుతుంది. అయితే, నిలబడేటపుడు శరీరానికి నువ్వుల నూనెతో మర్దన చేస్తే చాలామంచిది.
................
పెద్దలకు షష్టిపూర్తి చేసేది 60 ఏళ్లు నిండాయని కాదు.. భూమితో పాటు 60 సార్లు సూర్యడి చుట్టూ పరిభ్రమించి షష్టి పూర్తి చేశారని షష్టి పూర్తి చేస్తారు.
ఓటుహక్కు, ఎన్నికల సమాచారం కోసం
http://www.useurvote.com/
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment