Sunday, March 22, 2009

ఉగాది పచ్చడి రుచి చూడండి


మీరు ఉగాది రోజున ఇంటికి దూరంగా ఉన్నారా. ఉగాది పచ్చడి తినలేకపోతున్నామని బాధపడుతున్నారా... మరేం భయం లేదు. ఎలా చేయాలో నేను నేర్పుతాను... చాలా వీజీ అది.
ఇవి కావాలి

  • వేపపువ్వు - గుప్పెడు
  • మామిడికాయ - ఒకటి (చిన్నది చాలు)
  • బెల్లం - వంద గ్రాములు
  • చెరకు - పది అంగుళాల ముక్క
  • కొత్త చింతపండు రసం - రెండు కప్పులు
  • ఉప్పు - చిటికెడు
  • పచ్చిమిర్చి - ఒకటి లేదా రెండు చాలు

ఇలా చేయాలి
వేపపువ్వును కాడలు లేకుండా ఒలిచి పక్కన పెట్టాలి.
మామిడి కాయ, పచ్చిమిర్చి, చెరకును సన్నగా తరగాలి
బెల్లాన్ని మెత్తగా పొడిచేయాలి
ఇప్పుడు
వీటన్నింటిని చింతపండు రసంలో కలపాలి
చివరగా.. ఉప్పు వేసి కలిపితే ఉగాది పచ్చడి రెడీ.. సింపుల్
మరింత టేస్టు కోసం అరటి పండు ముక్కలుముక్కలుగా చేసి కలుపుకోవచ్చు.

నోట్ - బెల్లం బదులు చక్కెర వాడకండి. రుచి మారుతుంది.

స్వీకరణ : సాక్షి దినపత్రిక నుంచి

No comments: