Saturday, June 13, 2009

తెలివితోనే సంసార సౌఖ్యం

తెలివైనోడే బెడ్ రూంలో సుఖ జీవి!!

కోపవో ఆవేశవో వస్తే ఆపుకోలేకపోవడం... మరీ మూడీగా పెదాలకు తాళం వేసుకుని కూర్చోవడం... భావోద్వేగాలు నియంత్రించుకొనే శక్తి లేకపోవడంవల్ల వచ్చే సమస్యలివి. ఇవి లైంగిక జీవితం మీదా ప్రభావం చూపుతాయంటున్నారు మనస్తత్వశాస్త్ర నిపుణులు. భావోద్వేగాల్ని సరిగ్గా నియంత్రించుకోగలిగేవారు ఇంటా బయటా అందరితో చక్కగా ప్రవర్తిస్తారు. అందరి మన్ననలూ పొందుతారు. అది వారిని మానసికంగా ఆనందంగా ఉంచుతుంది. అదే మూడ్‌తో పడకగదిలోకి వెళతారు కాబట్టి, బెడ్‌రూమ్‌లో ఎలా ప్రవర్తిస్తే ఆనందాన్ని సొంతం చేసుకోవచ్చో వారికి తెలుసు కాబట్టి అక్కడా చక్కటి ఫలితాలు పొందుతారన్నది సైకాలజిస్టుల విశ్లేషణ. మానసికపరమైన సమస్యలు ఉన్నవారు మినహా సహజంగానే ప్రతిమనిషికీ పుట్టుకతోనే ఈ శక్తి ఉంటుందనీ కానీ పెరిగిన వాతావరణాన్నిబట్టీ క్రమంగా మనస్తత్వాల్లో మార్పులు వస్తాయనీ వారు చెబుతున్నారు. కౌన్సెలింగ్‌ ద్వారా ప్రవర్తనలో చిన్నచిన్న మార్పులు చేసుకోగలిగితే ప్రతిరాత్రీ వసంతరాత్రేనని సెలవిస్తున్నారు.

No comments: