1.తొలకరి మించు దీవగతితోపదుకాణము మీద ఉన్న ఆ
అలికుల వేణి తో దమలపాకుల బేరము లాడబోయి నే
వలచుటకేమి? శంకరుని వంటి మహాత్ముడె లింగరూపి యై
కలికిమిటారిగుబ్బచనుగట్టుల సందున నాట్యమాడగన్.
తా:తొలకరి మెరుపుతీగను మించిన సౌందర్యరాశి తమలపాకులమ్మే దుకాణంలో కూర్చుని బేరం చేస్తోంది. శ్రీనాథుడు తమలపాకులకై వెళ్ళి ఆ అందానికి ముగ్ధుడై ఆమెను వలచాడు. తన వలపును సమర్థించుకుంటూ ఇలా అంటున్నాడు..
"ఈ సుందరిని చూసి నేను వలచుటలో దొషం ఇసుమంతైనా లేదు. ఎందుచేతనంటే నా కన్నా ముందే శంకరుని వంటి మహాదేవుడే ఆ ఘన సౌందర్యరాశి ఎత్తయిన పాలిండ్ల మధ్యలో లింగరూపి యై నాట్యం చేస్తున్నాడు."
Wednesday, March 4, 2009
Subscribe to:
Post Comments (Atom)
5 comments:
మంచి పద్యం గుర్తుచేశారు ప్రకాష్గారు. ఇక్కడ మరో విశేషమేమిటంటే అక్కడ కూర్చున్నది లిగాయతుల పడచు. వీరెక్కువగా కర్నాటక ప్రాంతంలో వుంటారు. (మన కవిగారు పల్నాడు మీదుగా కర్నాటక పోయి డిండిముణ్ణి వోడించిన సంగతి తెలిసిందే కదా.) సదరు లింగాయతులు (శివ) లింగాలని మెడలో కట్టుకుంటారు. ఈ అమ్మణ్ణీ అలాగే కట్టుకుంటే ఆ లింగము పోయి అక్కడ చేరినది.. శివ శివా..!!
అన్నట్టు ఈ పద్యం వ్రాసింది స్రీనాధుడు కాదు గురువుగారు.. శ్రీనాధుడు.. స్త్రీనాధుడని అన్నా కొంచెం సరిపోయేది.. ;) అలాగే "గబ్బ చనులు" కావవి "గుబ్బ చనులు"
సరిచేయగలరు.
మరో మాట - ఇది శృంగార పద్యమే (చాటువు) కాని శృంగార నైషదంలోనిది కాదనుకుంటా..!!
మంచి ? ;-) పద్యాన్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు....మీకభ్యంతరం ఉండడనుకొని నా బ్లాగులో పెట్టి మీ బ్లాగుకు లంకె వేసాను :-)
తప్పులు గుర్తించి తెలియజేసిన ఆ వ్యక్తికి ధన్యవాదాలు
వాటిని సరిచేశాను...గమనించగలరు
^-^ prakash chowdhary
eenadu pythyam odhalaledannamata..!
Post a Comment