Saturday, January 17, 2009

మన ఒకటి మరిచిపోయాం

ఒక పెద్దాయన దారిలొ నదుచుకుటూ వెల్తున్నడు
కొంత దూరం పోయాక దారిలో చిన్న గుంత కనిపించింది
మధ్యలో ఈ గుంత ఏంటి అని తొంగి చూశాడు.
అందులో ఒక గండు చీమ పైకి రావడానికి ప్రయత్నిస్తూ ఉంది
అరె పాపం అని పెద్దాయన దానిని తీయబోయాడు
చేయి గుంతలో పెట్టగానే అది చేయి చురుక్కుమనేలా గట్టిగా కరిచింది
ఐనా పెద్దాయన మళ్లీ దానిని రక్షించబోయాడు.
ఆరేడు సార్లు కరిచాక బాధ పడుతూనే దానిని బయటికి తీశాడు
ఇదంతా పక్క నుంచి గమనిస్తున్న ఓ కుర్రాడు..
పెద్దాయనా నీకేమైన పిచ్చా అన్ని సార్లు దానితో కరిపించుకున్నావెందుకు అని అడిగాడు..
దానికి ఆ పెద్దాయన చెప్పిన సమాధానం చదవండి
చూడు బాబు ....
కరవడం చీమ సహజ లక్షణం
చక్కగా ఆలోచించడం మనిషి సహజ లక్షణం
ఆ చిన్న ప్రాణి తన లక్షణన్ని అంత పట్టుదలతో ప్రదర్శించినపుడు
మనిషిగా నేను కూడా నా లక్షణాన్ని ప్రదర్శించాను

నీతి: దేవుడు సృష్టిలో ప్రతి ప్రాణికి ఒక సహజ లక్షణం ఇచ్చాడు..

"ఆలోచన అద్భుతమైన లక్షణాన్ని మాత్రం మనిషికి ఇచ్చాడు "
కాని దానిని మనం వృథా చేస్తున్నాం

THINK CREATIVE... LIVE BETTER THAN NOW !!