Saturday, November 8, 2008

ప్రేమ అంటే




ప్రేమ

ఈ పదానికి ఎవరికి ఇష్టం వచ్చినట్లు, వారికి నచ్చినట్లు నిర్వచనం చెప్పుకొంటూ వచ్చారు. పవిత్రమైన ఈ భావనను ప్రతి ఒక్కరు జీవితంలో ఎపుడో ఒకసారి తప్పుగా అర్థం చేసుకుని ఉంటారు. మన ప్రాంతంలో కొందరు పెద్దవాళ్లకి ఇది బూతు పదంగా కూడ అనిపిస్తుంది. ఎవరు ఏమి అనుకున్నా అది వారి వరకే పరిమితం.
ప్రేమకు ఎవరెన్ని నిర్వచనాలు ఇచ్చినా 2 నిర్వచనాలు మాత్రమే బాగా ప్రాచుర్యం పొందాయి.

1. ప్రేమ గుడ్డిది
2. మనిషిని చూసి కలిగేది ప్రేమ కాదు, మనసును చూసి కలిగేది ప్రేమ అని.
ఒక్క విషయం మాత్రం నిజం: అదేంటంటే ఎదుటి వ్యక్తి మనసు ఎంత మంచిది ఐనా ఆ విషయం తెలియకపోతే చూడడానికి చక్కగా లేని వారిని చూస్తే ప్రేమ పుట్టదు. (అర్థం కాకపోతె ఈ వాక్యం ఇంకోసారి చదవండి).

కానీ,
ప్రేమ అంటే ఆకర్షణా కాదు,
ఆకర్షణ అంటే ప్రేమా కాదు...

ప్రేమలో ఆకర్షణ ఒక భాగం. ప్రేమ ఒకసారే పుడుతుంది... ఆకర్షణ ఇద్దరి ప్రేమికుల మధ్య తరచూ పుడుతూ నే ఉంటుంది.
ప్రేమ చెట్టు ఐతే పుట్టి రాలిపొయే ఆకులు, పూసి వాడిపొయే పూవులు ఆకర్షణ. ఆకులు, పూలు మళ్లీమళ్లీ వస్తూ పోతూ ఉంటాయి ప్రేమికుల మధ్య ఆకర్షణ లాగా!
ఇక్కడ ఇంకో విషయం ఉంది. ఆకర్షణ ఇరువురిలోనూ కలగాలని... అదీ ఒకేసారి కలగాలని ఏం లేదు. సందర్బం సృష్టించేది ఆకర్షణ కాబట్టి ఎవరిలో ఎపుడైనా కలగవచ్చు.
ఆకర్షణ వల్ల పుట్టిన ప్రేమ ఎంతోకాలం నిలవదు. అది తాత్కాలికం. వయసు ప్రభావం.

మరి ఇక్కడ ఇంత చెప్పాను కదా.. ఎందుకు, ఎలా చెప్పానో కూడా రెండు ముక్కల్లో చెబుతా.
ఈ అక్షరాలన్నీ నా హృదయం లోతుల నుంచి బయటికి వచ్చినవి. ఈ స్థాయిలో నేను స్పందించడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది.
ఉన్నత వ్యక్తిత్వం (చక్కని రూపం కూడ ఉందిలెండి) కలిగిన ఓ యువతి గురించి మా వాడు పదే పదే చెప్పడం వల్ల కొన్నాళ్లకు ఆమె నా మనసుపై బలమైన ముద్ర వేసింది. (బహుశా ఆ ముద్రే ప్రేమ కావచ్చు.) ఆ మహొన్నత పదహారణాల తెలుగింటి ఆడపడుచును నేను స్వయంగా చూడకుండానే ఆమె ప్రేమలో పడిపోయాను. ఆ ముచ్చటైన భావనే నా చేత ఈ కవిత్వం రాయించాయి. అంతే కాని నేను స్వతహాగా కవిని కాదండొయ్ !!
కొసమెరుపు: అవసరాన్ని బట్టి అందరూ ప్రేమకు నిర్వచనం చెప్పుకున్నట్టే నేనూ ఓ ప్రయత్నం చేశాను.
" ఓ వ్యక్తిని చూసినపుడు కలిగేదే ప్రేమ కాదు.. చూడకుండా కూడా వ్యక్తిత్వం మనల్ని ఆ వ్యక్తి ప్రేమలో పడేయవచ్చు."
ఒక్కమాటలో చెప్పనా ....


**
ఆలోచన కూడా ప్రేమే **

3 comments:

RAVI KIRANAM said...

well tried to narrated. Of cource it's nice.

Prakash chowdary said...
This comment has been removed by the author.
Unknown said...

its nice