Saturday, August 15, 2009

ఓ షావుకారు .. ఈ నిజం తెలుసుకో..



ఎంతో సున్నితమైన,

సూక్ష్మమైన

అత్యాధునిక వైద్య చికిత్సలను

అందిస్తామని చెప్పే మహా మహా కార్పొరేట్ ఆస్పుత్రులు స్వైన్ ఫ్లు గురించి ఒక్కమాట కూడా మాట్లాడటం లేదు ప్రభుత్వం ఆదేసిస్తే తప్ప స్వైన్ ఫ్లు లక్షణాలు ఉన్నవారిని కూడా అనుమతించలేదు అనుమానం వచ్చిన వెంటనే గవర్నమెంట్ ఆస్పత్రికి పంపించేవి. ప్రజా జీవనంలో ఈ ధనిక ఆస్పత్రుల పాత్ర ఏమిటో తెలియాలంటే - సామూహిక ఆరోగ్య సమస్యలు తలెత్తిన సందర్భంలో చూడాలి.

మెదడు వ్యాపు, డెంగీ వంటి జ్వరాలు వస్తే కొరంటీ ఆస్పత్రి !

సిసు సమస్యలు వస్తే నిలోఫర్ !!

ఇపుడు స్వైన్ ఫ్లు వస్తే చాతి ఆస్పత్రి ఇవే వార్తల్లో ఉంటాయి...

ఎందుకంటే ఇవే ఆదుకోవాలి మనల్ని..

కానీ వేలకు వేలు ఖర్చు అయ్యే పరీక్షల సదుపాయలుండే స్టార్ ఆస్పత్రులలో డెంగీ, స్వైన్ ఫ్లు నిర్దారించే పరికరాలే ఉండవు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ప్రైవేటు ఆధిపత్యం ఎంత ప్రమాధమో తెలియజెప్పడానికి ఇప్పుడైనా మనం ప్రభుత్వ ఆస్పత్రుల అవసరం గుర్తించాలి, వైద్య ఆరొగ్య వ్యవస్తలు ప్రభుత్వం చేతిలొ ఎందుకు ఉండాలో తెలుసుకోవాలి. మిగిలినంత వరకైనా దక్కించుకోవాలి.. .... డబ్బులు వచ్చే జబ్బుల చికిత్సలనన్నింటిని ఆరోగ్య శ్రీ పేరుతో కార్పొరేట్ ఆస్పత్రులకు మల్లించి ప్రాతమిక ఆరోగ్య కేంద్రాలను ప్రతిష్టాత్మక వైద్య పరిశోధనాలయాలను పెద్ద ప్రభుత్వ ఆస్పత్రులను నిధులు లేకుండా చంపేస్తే సమాజానికి భవిష్యతే ఉండదు.


- ప్రజా ప్రయోజనార్థం ఆంధ్రజ్యోతి పత్రిక రాసిన అద్బుతమైన ఎడిటోరియల్ లొ కొన్ని వాక్యాలివి... (డేట్: 16-8-2009) ఎడిటర్ శ్రీనివాస్ గారికి కోటి దండాలు

2 comments:

సృజన said...

ఆలోచించవలసిన విషయాన్ని వివరించారు.

Anonymous said...

మన ప్రభుత్వ గోడును పక్కన పెడితే, స్వైన్ ఫ్లూ కు ఒక చక్కటి పరిష్కారం వున్నది. పచ్చటి తిప్పతీగను గనక వాడితే, స్వైన్ ఫ్లూ ను నివారించవచ్చు. తిప్పతీగ పల్లెలలో సాధారణంగా దొరికే మూలిక. మీరు మరల మీకు తెలిసిన వారందరికి ఈ విషయాన్ని తెలపవలసినదింగా నా మనవి.