Tuesday, June 23, 2009

ఏపీ ముఖ్యమంత్రులు.. కొన్ని నిజాలు


ఏపీ ముఖ్యమంత్రులు.. కొన్ని నిజాలు

ఎన్టీఆర్‌:
నిశితమైన పరిశీలనాశక్తి ఉండేది ఆయనకు. ఏదైనా చెప్పాలంటే చిన్నచిన్న వివరాలతో సహా చెప్పేవారు. మన నుంచి ఏదైనా సమాచారం కావాలన్నా అలాగే అడిగి తెలుసుకునేవారు. ఆయన హయాంలో ఒకసారి... రాష్ట్రపతి మన రాష్ట్రానికి వస్తారని తెలియగానే దగ్గరుండి అన్ని ఏర్పాట్లూ చేయించారు. నన్ను పిలిచి 'మెనూ రాసుకోండి' అన్నారు. నాకేం అర్థం కాలేదు. రాష్ట్రపతికి ఏ పూట భోజనంలో ఏం వడ్డించాలో, ఆయన బసచేసేచోట ఎప్పుడు ఏ సంగీతం వినిపించాలో సహా... ప్రతిదీ చెప్పారు. పేదల సంక్షేమ కార్యక్రమాలంటే అమితమైన ఇష్టం.
చెన్నారెడ్డి: ఏ విషయాన్నైనా చాలా వేగంగా గ్రహిస్తారు. అంతే వేగంగా నిర్ణయాలు తీసుకోవడంలో దిట్ట. వ్యక్తిగతంగా నాతో చాలా ఆప్యాయంగా ఉండేవారు. రాజస్థాన్‌ గవర్నర్‌గా వెళ్లిం తర్వాత కూడా నా పుట్టినరోజు గుర్తుపెట్టుకుని మరీ ఫోన్‌ చేసి విషెస్‌ చెప్పారు. ఐ వజ్‌ రియల్లీ టచ్‌డ్‌.
జనార్దనరెడ్డి: ఆయనకు ఎంత ఓపికో. రాత్రి ఏ పదకొండింటికో సంతకాలు చేయాలంటూ ఫైల్స్‌ తీసుకెళ్లినా విసుక్కోకుండా వాటిని చూసేవారు. అప్పట్లో ఆలిండియా రేడియోలో నేను పొద్దున పూట 'సూక్తిసుధ' అనీ 'మహనీయుల మహితోక్తులు' అనీ... ఏవో నాలుగు మంచిమాటలు చెప్పేవాణ్ని. అది నా పర్సనల్‌ ఇంట్రెస్ట్‌. ఆ కార్యక్రమాన్ని విని నాకు ఫోన్‌ చేసి 'ఇవాళ నువ్వు చెప్పింది బావుంది సుబ్బారావ్‌, నే విన్నాను' అనేవారు.
చంద్రబాబునాయుడు: టెక్నాలజీని అందిపుచ్చుకోవాలన్న తపన, అందిపుచ్చుకునే వేగం అధికం. కష్టించి పనిచేసే మనస్తత్వం. ఎక్కడ ఏ మంచి జరిగినా ఏ దేశంలో అభివృద్ధి కనపడినా రాష్ట్రంలో అది ఎలా అమలుచెయ్యెుచ్చో ఆలోచించేవారు.
వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి: పాజిటివ్‌ థింకింగ్‌ ఆయన బలం. మిన్ను విరిగి మీద పడే పరిస్థితుల్లోనూ ప్రశాంతంగా కూర్చుని సానుకూల దృక్పథంతో ఆలోచించగలగడం ఆయన నైజం.

No comments: