Saturday, August 15, 2009

ఓ షావుకారు .. ఈ నిజం తెలుసుకో..



ఎంతో సున్నితమైన,

సూక్ష్మమైన

అత్యాధునిక వైద్య చికిత్సలను

అందిస్తామని చెప్పే మహా మహా కార్పొరేట్ ఆస్పుత్రులు స్వైన్ ఫ్లు గురించి ఒక్కమాట కూడా మాట్లాడటం లేదు ప్రభుత్వం ఆదేసిస్తే తప్ప స్వైన్ ఫ్లు లక్షణాలు ఉన్నవారిని కూడా అనుమతించలేదు అనుమానం వచ్చిన వెంటనే గవర్నమెంట్ ఆస్పత్రికి పంపించేవి. ప్రజా జీవనంలో ఈ ధనిక ఆస్పత్రుల పాత్ర ఏమిటో తెలియాలంటే - సామూహిక ఆరోగ్య సమస్యలు తలెత్తిన సందర్భంలో చూడాలి.

మెదడు వ్యాపు, డెంగీ వంటి జ్వరాలు వస్తే కొరంటీ ఆస్పత్రి !

సిసు సమస్యలు వస్తే నిలోఫర్ !!

ఇపుడు స్వైన్ ఫ్లు వస్తే చాతి ఆస్పత్రి ఇవే వార్తల్లో ఉంటాయి...

ఎందుకంటే ఇవే ఆదుకోవాలి మనల్ని..

కానీ వేలకు వేలు ఖర్చు అయ్యే పరీక్షల సదుపాయలుండే స్టార్ ఆస్పత్రులలో డెంగీ, స్వైన్ ఫ్లు నిర్దారించే పరికరాలే ఉండవు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ప్రైవేటు ఆధిపత్యం ఎంత ప్రమాధమో తెలియజెప్పడానికి ఇప్పుడైనా మనం ప్రభుత్వ ఆస్పత్రుల అవసరం గుర్తించాలి, వైద్య ఆరొగ్య వ్యవస్తలు ప్రభుత్వం చేతిలొ ఎందుకు ఉండాలో తెలుసుకోవాలి. మిగిలినంత వరకైనా దక్కించుకోవాలి.. .... డబ్బులు వచ్చే జబ్బుల చికిత్సలనన్నింటిని ఆరోగ్య శ్రీ పేరుతో కార్పొరేట్ ఆస్పత్రులకు మల్లించి ప్రాతమిక ఆరోగ్య కేంద్రాలను ప్రతిష్టాత్మక వైద్య పరిశోధనాలయాలను పెద్ద ప్రభుత్వ ఆస్పత్రులను నిధులు లేకుండా చంపేస్తే సమాజానికి భవిష్యతే ఉండదు.


- ప్రజా ప్రయోజనార్థం ఆంధ్రజ్యోతి పత్రిక రాసిన అద్బుతమైన ఎడిటోరియల్ లొ కొన్ని వాక్యాలివి... (డేట్: 16-8-2009) ఎడిటర్ శ్రీనివాస్ గారికి కోటి దండాలు

Monday, August 10, 2009

హైదరాబాద్‌లో ప్రపంచ కూచిపూడి నాట్యోత్సవాలు

హైదరాబాద్‌లో వచ్చే ఏడాది సిలికానాంధ్ర తెలుగు సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ కూచిపూడి నాట్యోత్సవాలను నిర్వహించనున్నారు. 2010 డిసెంబరు 23 నుంచి 25 వరకు ఈ ఉత్సవాలను నిర్వహించనున్నట్లు సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్‌ వెల్లడించారు. ఆదివారమిక్కడ సిలికానాంధ్ర ఎనిమిదో వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనంద్‌ మాట్లాడుతూ.. అక్టోబరు 3న సిలికాన్‌ వ్యాలీలో తెలుగు సాంస్కృతికోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గతంలో తమ సంఘం అమెరికాలో ప్రపంచ కూచిపూడి నాట్యోత్సవాలు, హైదరాబాద్‌లో అన్నమయ్య లక్షగళ సంకీర్తనార్చనలను నిర్వహించి గిన్నిస్‌బుక్‌లో చోటు పొందామన్నారు. అమెరికాలోని 14 రాష్ట్రాల్లో 'మనబడి' పేరిట ప్రవాసాంధ్ర విద్యార్థుల కోసం 50 పాఠశాలలను ఏర్పాటు చేశామని, ఈ విద్యా సంవత్సరం నుంచి మరో 20 పాఠశాలలను ప్రారంభిస్తున్నట్లు వివరించారు

Saturday, August 8, 2009

శృంగారమే నా జీవితం: షకీరా


‘‘నేను ఉత్సాహంగా ఆడిపాడుతున్నానంటే... అందరూ అనుకుంటున్నట్టు ఫిట్ నెస్ ఎక్సర్ సైజులు, పోషకాహారం... ఇవేమీ కారణం కాదు... నా ఉత్సాహానికి, ఉల్లాసానికి కారణం సెక్సర్ సైజు (శృంగారం)’’

- షకీరా,

అమెరికా పాప్‌ గాయని షకీరా శృంగారమే జీవితానికి మూలాధారమంటున్నారు. వ్యాపారవేత్త ఆంటోనియో డీ లారాతో తొమ్మిదేళ్లుగా సహజీవనం సాగిస్తున్న ఆమె మాట్లాడుతూ.. మానవ జీవితానికి శృంగారమే మూలమని, ఇదే మానవ సంబంధాల్లో ఉత్కృష్టమైందని www.femalefirst.co.uk వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది.

అణు విద్యుత్ ఎందుకు?


ప్రస్తుతం విద్యుదుత్పత్తి కోసం ఎక్కువగా ఉపయోగిస్తున్న బొగ్గు, సహజవాయువు వంటి శిలాజ ఇంధనాల వల్ల రెండు రకాల సమస్యలున్నాయి. కరెంటును ఉత్పత్తి చేసే క్రమంలో ఈ ఇంధనాలను మండించినప్పుడు వాతావరణంలోకి కార్బన్‌డయాక్సైడ్‌ వంటి విషవాయువులు పెద్ద ఎత్తున విడుదలై భూమి ఉష్ణోగ్రతలను పెంచుతున్నాయి. ఫలితంగా గ్లోబల్‌వార్మింగ్‌ సమస్య తలెత్తి వాతావరణంలో ప్రమాదకరమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇక రెండో సమస్య, ఈ శిలాజ ఇంధనాలు భూమిలో పరిమితంగానే ఉన్నాయి. ప్రస్తుత వేగంతో ఉపయోగిస్తూ వెళ్తే అవి పూర్తిగా అడుగంటిపోవటానికి కొన్ని దశాబ్దాలు చాలు. ఈ నేపథ్యంలో కాలుష్యరహిత, అపరిమితమైన అణుశక్తి ఒక ప్రత్యామ్నాయంగా ముందుకొచ్చింది.

Sunday, July 19, 2009

రాజకీయాల నుంచి తప్పుకోనున్న చిరు...


chiru position in politics...


రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితికి అద్దం పట్టే కార్టూన్ చిత్రం ఇది. ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ ‘ఈనాడు సండే బుక్ ’లో వేశారు. చిరంజీవికి రాజకీయ అనుభవం ఎటూ లేదు.. పోనీ సరైన సలహాదారులను ఎంచుకునే తెలివీ లేదు... దీంతో ఆయన ప్రభ రోజురోజుకు తగ్గుతూ పోతోంది. వచ్చే ఎన్నికల నాటికి పీఆర్పీని నిర్వీర్యం చేయాలని ఇతర పార్టీలు భావిస్తున్నాయని ఆయన చాలా తెలివి తక్కువ వ్యాఖ్య చేశారు.. కానీ ఆయన అనాల్సిన మాట ఇది కాదు. ఎవరెన్ని కుట్రలు పన్నినా మేము నిలదొక్కుకుంటాం. మా పార్టీని ఎవరూ ఏమీ చేయలేరు. మా శ్రేణులు చాలా బలంగా ఉన్నాయని వ్యాఖ్యానించి ఉంటే... కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం పెరిగేది... ఈ పరిస్థితులను గమనిస్తుంటే.. చిరంజీవి భస్మాసురుడిలా తనను తానే నాశనం చేసుకుంటున్నట్టు అనిపిస్తుంది.

Tuesday, June 23, 2009

ఏపీ ముఖ్యమంత్రులు.. కొన్ని నిజాలు


ఏపీ ముఖ్యమంత్రులు.. కొన్ని నిజాలు

ఎన్టీఆర్‌:
నిశితమైన పరిశీలనాశక్తి ఉండేది ఆయనకు. ఏదైనా చెప్పాలంటే చిన్నచిన్న వివరాలతో సహా చెప్పేవారు. మన నుంచి ఏదైనా సమాచారం కావాలన్నా అలాగే అడిగి తెలుసుకునేవారు. ఆయన హయాంలో ఒకసారి... రాష్ట్రపతి మన రాష్ట్రానికి వస్తారని తెలియగానే దగ్గరుండి అన్ని ఏర్పాట్లూ చేయించారు. నన్ను పిలిచి 'మెనూ రాసుకోండి' అన్నారు. నాకేం అర్థం కాలేదు. రాష్ట్రపతికి ఏ పూట భోజనంలో ఏం వడ్డించాలో, ఆయన బసచేసేచోట ఎప్పుడు ఏ సంగీతం వినిపించాలో సహా... ప్రతిదీ చెప్పారు. పేదల సంక్షేమ కార్యక్రమాలంటే అమితమైన ఇష్టం.
చెన్నారెడ్డి: ఏ విషయాన్నైనా చాలా వేగంగా గ్రహిస్తారు. అంతే వేగంగా నిర్ణయాలు తీసుకోవడంలో దిట్ట. వ్యక్తిగతంగా నాతో చాలా ఆప్యాయంగా ఉండేవారు. రాజస్థాన్‌ గవర్నర్‌గా వెళ్లిం తర్వాత కూడా నా పుట్టినరోజు గుర్తుపెట్టుకుని మరీ ఫోన్‌ చేసి విషెస్‌ చెప్పారు. ఐ వజ్‌ రియల్లీ టచ్‌డ్‌.
జనార్దనరెడ్డి: ఆయనకు ఎంత ఓపికో. రాత్రి ఏ పదకొండింటికో సంతకాలు చేయాలంటూ ఫైల్స్‌ తీసుకెళ్లినా విసుక్కోకుండా వాటిని చూసేవారు. అప్పట్లో ఆలిండియా రేడియోలో నేను పొద్దున పూట 'సూక్తిసుధ' అనీ 'మహనీయుల మహితోక్తులు' అనీ... ఏవో నాలుగు మంచిమాటలు చెప్పేవాణ్ని. అది నా పర్సనల్‌ ఇంట్రెస్ట్‌. ఆ కార్యక్రమాన్ని విని నాకు ఫోన్‌ చేసి 'ఇవాళ నువ్వు చెప్పింది బావుంది సుబ్బారావ్‌, నే విన్నాను' అనేవారు.
చంద్రబాబునాయుడు: టెక్నాలజీని అందిపుచ్చుకోవాలన్న తపన, అందిపుచ్చుకునే వేగం అధికం. కష్టించి పనిచేసే మనస్తత్వం. ఎక్కడ ఏ మంచి జరిగినా ఏ దేశంలో అభివృద్ధి కనపడినా రాష్ట్రంలో అది ఎలా అమలుచెయ్యెుచ్చో ఆలోచించేవారు.
వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి: పాజిటివ్‌ థింకింగ్‌ ఆయన బలం. మిన్ను విరిగి మీద పడే పరిస్థితుల్లోనూ ప్రశాంతంగా కూర్చుని సానుకూల దృక్పథంతో ఆలోచించగలగడం ఆయన నైజం.

Friday, June 19, 2009

కూలీ నుంచి కింగ్ ... వేణుభగవాన్ లైఫ్ స్టోరీ


నాటి కూలీ...నేటి వ్యక్తిత్వ వికాస నిపుణుడు

ఆటుపోట్లు... అవమానాలు... సమస్యలు ...ప్రతికూల వాతావరణం... ఇలా ఎన్ని కష్టాలు ఎదురైనా ఎదగాలన్న తపన, కొత్తదనం కోసం నిరంతర అన్వేషణ... ఓ కుర్రాడిని విజయ తీరాలకు నడిపించింది. ఆర్థిక ఇబ్బందులతో ఐటీఐ వరకే చదవగలిగినా... బతుకు పోరాటంలో రూ.12 రోజు కూలీతో కెరీర్‌ను ప్రారంభించాడు. ఎక్కడ ప్రారంభించామన్నది కాదు లక్ష్యసాధనలో ఎక్కడి చేరామన్నదే ఆ కుర్రాడికి ప్రధానం. తనలో ఉన్న ఆత్మనూన్యతను అధిగమించేందుకు మొదలైన ప్రయత్నం... కొత్త ప్రపంచాన్ని సృష్టించాలన్న సంకల్పానికి దారితీసింది. అంతే... వ్యాపారాన్ని వదిలి... వ్యక్తిత్వ వికాస నిపుణులయ్యారు. ఒక విజయం నుంచి మరో విజయానికి అతని ప్రస్థానం కొనసాగుతోంది. అనతికాలంలోనే 700పైగా ప్రసంగాలిచ్చి లక్ష్యం కోసం తన ప్రయాణాన్ని సాగిస్తున్నారు. ఆ స్ఫూర్తి కెరటమే నగరానికి చెందిన వేణు భగవాన్‌.

పదో తరగతి పరీక్షలు రాసి.. వేసవిలో చుట్టాలింటికి వెళ్లాడా కుర్రాడు. ఫలితాలొచ్చాయి. పరీక్షలో పాస్‌ అవతానన్న నమ్మకం ఉన్నా పైకి చెప్పలేనితనం. అంతలో... ఫలితాల పేపర్‌ పట్టుకొచ్చారొకరు. ఇంట్లో ఉన్న పిల్లల రిజల్ట్‌ కోసం ఆసక్తిగా చూస్తున్నారు. మిగితా వారి నెంబర్లు కనిపించినా... ఈ అబ్బాయి నెంబరు కనిపించలేదు. వీడా పాస్‌ అయ్యేది?... అన్న మాటలతో దిమ్మ తిరిగినంత పనైందా కుర్రాడికి. ఉబికివస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ... 'అపజయం ఇంత భయంకరమా?'అనుకున్నాడు. బేలగా... మౌనంగా ఉండిపోయాడు. రెండు నిమిషాలు గడిచాయి. 'అరే... తప్పుగా చూశాం. వేణు నెంబరు ఉంది. సెకండ్‌ క్లాస్‌లో పాస్‌ అయ్యాడు' అన్నారొకరు. వీడు జీవితంలో పైకి వస్తాడంటూ... అంతకు ముందే ఎగతాళి చేసిన బంధువు తన మాటల్నిమరిచి మెచ్చుకున్నాడు. విజయం సాధిస్తేనే విలువ ఉంటుందన్న విషయం ఆ కుర్రాడికి ఈ ఘటనతో మనసులో బలంగా నాటుకుపోయింది.

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం వద్ద చిన్న గ్రామానికి వేణు తండ్రి సర్పంచ్‌. ఆస్తిపాస్తులు బాగానే ఉన్నా... అనుకోని అర్థిక సమస్యలతో అవన్నీ కరిగిపోయాయి. ఈ మార్పు అతని చదువుపై పడింది. బంధువుల ఇళ్లలో... మిషనరీ హాస్టల్లో ఉంటూ చదువు సాగించారు. 'స్కూల్‌కి పన్నెండు కిలోమీటర్ల దూరం వెళ్లి వచ్చేవాడ్ని. గోదావరి మీదుగా ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంలో ట్యూషన్‌. రాత్రిళ్లు మాష్టారింట్లోనే పడుకొని ఉదయాన్నే ఇంటికి వెళ్లేవాడ్ని''... అంటూ నడకలతో సాగిన తన చదువు క్రమాన్ని వివరించారాయన. పదోతరగతి పాస్‌ అయ్యాక ఐటీఐలో చేరినా... కుటుంబ సమస్యల కారణంగా చదువుకు పుల్‌స్టాప్‌ పెట్టాల్సి వచ్చింది. ఉద్యోగంలో చేరేందుకు వయసు చాలదనటంతో... ఓ గ్లాస్‌ ఫ్యాక్టరీలో... పాత సీసాల్ని వేరే పనిలో రూ.12 రోజు కూలీగా చేరారు. తర్వాత మరో చిన్న ఉద్యోగం. ఎక్కడ చేరినా హుషారుగా పని చేయటంతో అందరి అభిమానాన్ని అనతికాలంలో పొందేవారు. ఓ చిన్న కంపెనీలో పని చేసేటప్పుడు అక్కడి ఉద్యోగులు ఇంగ్లిషులో మాట్లాడుతుంటే... గమ్మత్తుగా అనిపించేది. ఎలాగైనా తానూ ఇంగ్లిష్‌ మాట్లాడాలన్న తలంపుతో... రామకృష్ణ మఠంలో స్పోకెన్‌ ఇంగ్లిష్‌లో చేరారు. ఒక్కో కోర్సును రెండుసార్లు చదివారు. ఉద్యోగం చేస్తున్నా ఇంగ్లిష్‌ను మాత్రం వదల్లేదు. మొదట్లో కొరకరాని కొయ్యలా అన్పించిన ఇంగ్లిష్‌ వంటబట్టింది. కృషి ఫలించి... అంగ్లంలో అనర్గళంగా మాట్లాడుతుంటే అందరూ ఆశ్చర్యపోయేవారు. ఇంగ్లిష్‌లో వాగ్థాటి చూసి ఆయన ఐటీఐ వరకు మాత్రమే చదివారంటే ఎవరూ నమ్మేవారు కాదు.

వ్యాపారంలో...
చిన్న చిన్న ఉద్యోగాల తర్వాత ఓ ప్రైవేటు కంపెనీలో డ్రాఫ్ట్‌మెన్‌గా చేరారు. సోదరుడి స్క్రీన్‌ ప్రింటింగ్‌ వ్యాపారం మూస పద్ధతిలో సాగటాన్ని చూసి... దానికి స్వస్తి పలికి... మల్టీకలర్‌లో బ్యానర్లు తయారు చేశారు. ఈ కొత్త విధానానికి మార్కెట్‌లో అపూర్వ ఆదరణ లభించింది. ''ఊపిరి సలపనంత పని...20మందికి పైగా ఉద్యోగులు... కారు... ఇలా అన్నీ ఉన్నా చుట్టూ ఉన్న వారికి ఏమీ చేయలేకపోతున్నామన్న భావన... చేస్తోన్న పనిలో సంతృప్తి ఉన్నా... తెలీని కొరత వెంటాడేది. సంపాదనే కాదు... చుట్టూ ఉన్న సమాజానికి ఏదో ఒకటి చేయాలన్న తపన ఉండేది. దీనికి తోడు తెలీని ఆత్మనూన్యతకు గురయ్యేవాడ్ని. దాన్ని అధిగమించేందుకు వ్యక్తిత్వ వికాస కోర్సులకు వెళ్లా. శిక్షణలో భాగంగా ఓ అంశంపై మాట్లాడమంటే... అనర్గళంగా మాట్లాడి బెస్ట్‌ స్పీకర్‌ అవార్డు పొందా. చిన్నచిన్న విషయాలకే బాధ పడటం... తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యే వారిని చూసినప్పుడు పుస్తకం రాయాలనిపించింది. ఎవరికి వారు తమలో అంతర్లీనంగా ఉండే శక్తి గురించి వివరిస్తూ రాశా. ఆ పుస్తకం అనుకున్న దానికంటే విజయవంతమైంది'' అని చెప్పారు వేణు. మొదట తెలుగులో పుస్తకం రాసినా తర్వాత మరో పుస్తకాన్ని ఇంగ్లీషులో రాశారు.

ప్రతికూలతను...
నిరంతర అధ్యయనం... అభ్యాసమే తననీ స్థాయికి తీసుకొచ్చాయని వేణు అంటారు. జీవితంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితుల్ని పాఠాలుగా మార్చుకుంటే... విజయం దానంతట అదే వస్తుందంటారు. వ్యక్తిత్వ నిపుణులుగా జ్యూడిషియల్‌ అకాడమీ మొదలుకొని విభిన్న వర్గాలకు చెందిన నిపుణులకు 1995 నుంచి ఇప్పటివరకు 700పై ఉపన్యాసాల్ని ఇస్తూ... వేలాది మందిని ప్రభావితం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నెహ్రూ యువ కేంద్రం వారి 'బెస్ట్‌ యూత్‌' అవార్డు సాధించారు. దేశ వ్యాప్తంగా వ్యక్తిత్వ వికాస తరగతుల్ని బోధించేందుకు విబోల్డ్‌ అనే సంస్థను ఏర్పాటు చేసి... పాఠశాలల్లో... కళాశాలల్లో విద్యార్థులకు స్ఫూర్తివంతమైన ఉపన్యాసాలను ఉచితంగా బోధిస్తున్నానన్నారు. నలుగురు నడిచే దారిలో కాక... విభిన్నంగా నడుస్తూ... కొత్త ప్రపంచాన్ని కలిసి సృష్టిద్దామన్న ఆశయం నెరవేరాలని ఆశిద్దాం.

Saturday, June 13, 2009

తెలివితోనే సంసార సౌఖ్యం

తెలివైనోడే బెడ్ రూంలో సుఖ జీవి!!

కోపవో ఆవేశవో వస్తే ఆపుకోలేకపోవడం... మరీ మూడీగా పెదాలకు తాళం వేసుకుని కూర్చోవడం... భావోద్వేగాలు నియంత్రించుకొనే శక్తి లేకపోవడంవల్ల వచ్చే సమస్యలివి. ఇవి లైంగిక జీవితం మీదా ప్రభావం చూపుతాయంటున్నారు మనస్తత్వశాస్త్ర నిపుణులు. భావోద్వేగాల్ని సరిగ్గా నియంత్రించుకోగలిగేవారు ఇంటా బయటా అందరితో చక్కగా ప్రవర్తిస్తారు. అందరి మన్ననలూ పొందుతారు. అది వారిని మానసికంగా ఆనందంగా ఉంచుతుంది. అదే మూడ్‌తో పడకగదిలోకి వెళతారు కాబట్టి, బెడ్‌రూమ్‌లో ఎలా ప్రవర్తిస్తే ఆనందాన్ని సొంతం చేసుకోవచ్చో వారికి తెలుసు కాబట్టి అక్కడా చక్కటి ఫలితాలు పొందుతారన్నది సైకాలజిస్టుల విశ్లేషణ. మానసికపరమైన సమస్యలు ఉన్నవారు మినహా సహజంగానే ప్రతిమనిషికీ పుట్టుకతోనే ఈ శక్తి ఉంటుందనీ కానీ పెరిగిన వాతావరణాన్నిబట్టీ క్రమంగా మనస్తత్వాల్లో మార్పులు వస్తాయనీ వారు చెబుతున్నారు. కౌన్సెలింగ్‌ ద్వారా ప్రవర్తనలో చిన్నచిన్న మార్పులు చేసుకోగలిగితే ప్రతిరాత్రీ వసంతరాత్రేనని సెలవిస్తున్నారు.

Monday, June 8, 2009

స్థన సౌందర్యం- ఇంప్లాంట్ పద్ధతులు


సర్జరీ శిల్పం

శరీరం.. ఓ కళాత్మక సృష్టి! అణువణువునా సౌష్ఠవం.. ఎక్కడికక్కడ పొందికగా ఒదిగిపోయే అవయవ సౌందర్యం.. శరీరానికి శోభనిస్తాయి. అందాన్నీ.. ఆత్మవిశ్వాసాన్నీ ఇనుమడింపజేస్తాయి. అందుకే ఈ సౌష్ఠవం కాస్త అటూఇటూ అయితే.. ఎంతోమంది మానసికంగా మధనపడతారు. రొమ్ముల విషయంలో ఈ సమస్య చాలా ఎక్కువ.
రొమ్ములు ఎక్కువున్నా ఇబ్బందే.. తక్కువున్నా ఇబ్బందే! రొమ్ములు పెరగకపోతే అమ్మాయిలు చిన్నబోతుంటారు.. తమకు పెద్దగా పెరిగితే అబ్బాయిలు చికాకు పడుతుంటారు. అందుకే 'ప్లాస్టిక్‌ సర్జరీ' విభాగం ఈ ఎక్కువ తక్కువలను సౌందర్యాత్మకంగా సరిచేసే సురక్షిత విధానాలను ఆవిష్కరించింది. ఈ సర్జరీలను ఎవరికి చేస్తారు? ఎలా చేస్తారు? ఫలితాలు ఎలా ఉంటాయి.. ఇవన్నీ స్థూలంగా పరిచయం చేస్తోంది ఈ వారం సుఖీభవ!

సైజు పెంచటం (బ్రెస్ట్‌ ఆగ్యుమెంటేషన్‌)
ఎవరికి: రొమ్ములు తగినంత సైజు పెరగని వారికి.. సైజు చిన్నగా ఉన్నాయని మధనపడుతున్న వారికి ఉపయోగపడే సర్జరీ ఇది. దీనికి ముందు అసలు రొమ్ములు పెరగకపోవటానికి కారణం ఏమిటన్నది చూస్తారు. పోషకాహారలోపం, హార్మోన్ల సమస్యలతో ఇలా పెరగకపోవచ్చు. ఇవేమీ లేకపోయినా చాలామందిలో వంశపారంపర్యంగానే రొమ్ముల సైజు చిన్నగా ఉంటుంది. వీరికి సైజు పెంచేందుకు సర్జరీ చెయ్యచ్చు.
ఏ వయసులో: సాధారణంగా ఆడపిల్లల్లో రొమ్ముల పెరుగుదల 11-12ఏళ్ల నుంచీ ఆరంభమై 16-18 ఏళ్ల యుక్తవయస్సు వరకూ కొనసాగుతుంది. కాబట్టి రొమ్ములు పెంచే సర్జరీ చాలావరకూ 16 ఏళ్ల తర్వాతే చేస్తారు. (అరుదుగా సినిమా స్టార్స్‌ వంటివారు వృత్తి అవసరాల రీత్యా కాస్త ముందుగానే చేయించుకుంటుంటారు.)
ఎలా చేస్తారు: సైజు పెంచేందుకు ప్రధానంగా రొమ్ముల లోపల కృత్రిమ 'ఇంప్లాంట్‌' అమరుస్తారు. ఈ ఇంప్లాంట్‌లలో రెండు రకాలున్నాయి. 1. సెలైన్‌ నింపిన ఇంప్లాంట్‌: ఇది సిలికాన్‌తో తయారైన సంచీలాంటి తిత్తి. దీన్ని రొమ్ము లోపల అమర్చి.. అది కావాల్సినంత సైజుకు ఉబ్బేంత వరకూ సెలైన్‌ నింపి మూసివేస్తారు.2. సిలికాన్‌ ఇంప్లాంట్‌. బెలూన్‌లాంటి మృదువైన తిత్తి లోపల సిలికాన్‌ జెల్‌ నింపి ఉంటుంది. దీన్ని రొమ్ముల్లో అమరుస్తారు.
ఈ రెంటితో కూడా లాభాలున్నాయి, చిన్నచిన్న ఇబ్బందులూ ఉంటాయి.
సెలైన్‌ ఇంప్లాంట్‌.. ప్రయోజనాలు:
1. దీన్ని రొమ్ముల దగ్గర చాలా చిన్న కోతతోనే లోపల అమర్చవచ్చు. 2. ఒకవేళ ఎప్పుడన్నా దెబ్బల వంటివి తగిలి లేదా బాగా ఒత్తిడి పడి.. దీని నుంచి సెలైన్‌ రొమ్ముల్లోకి లీక్‌ అయితే.. ఆ సెలైన్‌ మన శరీరంలో కలిసిపోతుంది. ఎటువంటి నష్టమూ ఉండదు. 3. సెలైన్‌ లీక్‌ అయినప్పుడు రొమ్ముల సైజు తగ్గిపోయి, ఆ విషయం మనకు వెంటనే తెలుస్తుంది. అప్పుడు కావాలంటే ఇంప్లాంట్‌ను తీసెయ్యచ్చు.
ఇబ్బందులు:
1.
పెట్టేటప్పుడు దానిలో తగినంత సెలైన్‌ నింపకపోయినా.. లేక కాలక్రమేణా అందులో సెలైన్‌ కొద్దిగా తగ్గినా లోపలి నుంచి నీళ్లు కదులుతున్నట్టు గలగల శబ్దం రావచ్చు, ఇది చాలా అరుదు. 2. రొమ్ములను నొక్కితే మృదువుగా నెమ్మదిగా యథాస్థితికి రావటం కాకుండా నీటితిత్తిలా వెంటనే సర్దుకుంటాయి.


సిలికాన్‌ జెల్‌ ఇంప్లాంట్‌.. ప్రయోజనాలు:
1. చాలా మృదువుగా అత్యంత సహజంగా అచ్చం రొమ్ము కణజాలంలాగే లోపల ఒదిగిపోతుంది. ఏమాత్రం తేడా తెలియదు.
ఇబ్బందులు:
1. అమర్చటానికి ముందే దీనిలో జెల్‌ నింపి ఉంటుంది కాబట్టి దీన్ని లోపల అమర్చేందుకు కొద్దిగా పెద్దకోత అవసరమవుతుంది. 2. చాలా అరుదుగా ఇంప్లాంట్‌ చిరిగి లేదా పగిలి ఆ జెల్‌ లోపల లీక్‌ అయితే అదిచిక్కగా అలాగే ఉండిపోతుంది కాబట్టి అది లీక్‌ అయిన విషయం మనకు అస్సలు తెలియదు. దానిచుట్టూ మందపాటి కండ ఏర్పడి దానితో దీర్ఘకాలంలో కొన్ని ఇబ్బందులు రావచ్చని సంశయాలున్నాయి. అయితే ఇది చాలా చాలా అరుదనే చెప్పాలి.
ఎలా అమరుస్తారు: దీనికి ప్రధానంగా మూడు పద్ధతులున్నాయి. 1. చనుమొన చుట్టూ ఉండే నల్లటి వలయం అంచు వెంబడి కొద్దిగా కోతబెట్టి దాని గుండా ఇంప్లాంట్‌ను లోపలకు పంపించి.. తిరిగి దాన్ని కుట్టెయ్యటం. దీనివల్ల రొమ్ముల మీద ఎటువంటి మచ్చలూ ఏర్పడవుగానీ.. కొద్దిమందిలో కోతబెట్టినంత మేరా సన్నటి గీతలా మందంగా అనిపించవచ్చు. ఈ పద్ధతిలో సెలైన్‌ ఇంప్లాంట్‌ పెట్టటం తేలిక.

2. రొమ్ము కిందే గుండ్రంగా సుమారు రెండు అంగుళాల మేర కోతబెట్టి దాని గుండా ఇంప్లాంట్‌ లోపలికి పంపించి తిరిగి కుట్టెయ్యటం. ఇలా కాస్త పెద్దకోత పెట్టవచ్చు కాబట్టి పెద్దసైజులో ఉండే సిలికాన్‌ జెల్‌ ఇంప్లాంట్‌ పెట్టేందుకు ఇది బాగా పనికొస్తుంది. కోత తాలూకూ మచ్చ రొమ్ము కింద ఉండి బయటకు ఏమీ కనబడదు.
3. అసలు రొమ్ముల దగ్గర ఎటువంటి కోతలూ వద్దనుకుంటే చంకలో సన్నటి కోత బెట్టి.. దాని నుంచి లోపల్లోపలే రొమ్ముల వరకూ వచ్చి ఇంప్లాంట్‌ అమర్చటం. కాస్త ఎక్కువ సమయం పట్టినా ఇలా ఏ రకం ఇంప్లాంట్‌నైనా పెట్టొచ్చు. చంకలో కోత చాలా త్వరగా మానిపోతుంది, మచ్చలు కూడా కనబడవు.
సర్జరీ తర్వాత..?: సాధారణంగా రెండు రొమ్ములకూ ఒకేసారి.. రెండూ ఒకే సైజు ఉండేలా అన్నీ సరిచూసి సర్జరీ చేస్తారు. సర్జరీ తర్వాత ఒక నెలపాటు 'సపోర్టింగ్‌ బ్రా' వేసుకోమంటారు. ఇంప్లాంట్‌ బరువుకు కుట్లు సాగకుండా.. కోత త్వరగా మానిపోయేందుకు ఇది బాగా సహాయపడుతుంది. ఒకటి, రెండు రోజుల్లో నొప్పి వంటివన్నీ తగ్గిపోతాయి. వారంలో మామూలు పనులకు వెళ్లిపోవచ్చు. ఓ నెలపాటు ఆ ప్రాంతం మొద్దుబారినట్లు ఉండొచ్చు. తర్వాత అన్నీ సర్దుకుంటాయి.
సమస్యలేమీ ఉండవా?: చాలాచాలా అరుదుగా సర్జరీ తర్వాత కొద్దిరోజుల్లో- ఇన్ఫెక్షన్‌ రావచ్చు. కొద్దిరోజుల తర్వాత కూడా కుట్ల నుంచి స్రావాలు కారుతుండటం దీని లక్షణం. ఈ ఇన్ఫెక్షన్‌ వస్తే మాత్రం వెంటనే ఇంప్లాంట్‌ తీసెయ్యాల్సిందే. రెండు మూడు నెలల తర్వాత మళ్లీ పెట్టొచ్చు. ఇది చాలా అరుదనే చెప్పుకోవాలి. కోత మానిపోయిన తర్వాత ఇంకే ఇబ్బందీ ఉండదు. క్రమేపీ మచ్చ కూడా కలిసిపోతుంది. దీర్ఘకాలంలో- ఇంప్లాంట్‌ ఎన్నేళ్త్లెనా లోపల ఉండిపోతుంది. ఇతరత్రా కారణాలతో ఎవరైనా తీసేయించుకోవాలనుకుంటే ఎప్పుడైనా తీసేయించుకోవచ్చు. లోపల ఇంప్లాంట్‌ ఎలా ఉందో తెలుసుకోవటానికి అప్పుడప్పుడు మామోగ్రామ్‌ చేయించుకోవాలని సూచిస్తారు.
బిడ్డకు పాలు:
ఇంప్లాంట్‌ రొమ్ము వెనకాలగా ఉంటుంది కాబట్టి రొమ్ము కణజాలం
, క్షీర గ్రంథులకు ఏ ఇబ్బందీ ఉండదు. లోపల ఇంప్లాంట్‌ ఉన్నా బిడ్డకు చక్కగా పాలివ్వచ్చు.
ఇటీవలి కాలంలో- ఒంట్లో అదనంగా ఉన్న కొవ్వును లైపోసక్షన్‌ ద్వారా తొలగించి.. ఆ కొవ్వును రొమ్ముల్లోకి ఎక్కించి సైజు పెంచే విధానం కూడా అందుబాటులోకి వచ్చింది. కాకపోతే అలా ఎక్కించిన కొవ్వు రొమ్ముల్లో త్వరత్వరగా కరిగిపోతుండటం, దీంతో ఈ ప్రక్రియను మూడునాలుగుసార్లు చెయ్యాల్సి వస్తుండటంతో.. ఈ విధానం అంతగా ప్రాచుర్యంలోకి రాలేదు.
బిగువు పెంచటం (మ్యాస్టోపెక్సీ)
ఎవరికి: రొమ్ములు బాగా సాగిపోయిన వారికి ఇది ఉపయోగపడుతుంది.బిడ్డకు పాలిచ్చే సమయంలో రొమ్ముల సైజు పెరిగి.. ఆ తర్వాత సహజంగానే తగ్గాలి. కానీ కొందరికి తగ్గకుండా అలాగే ఉండి సాగినట్లు తయారవుతాయి, ముఖ్యంగా కాస్త లేటు వయసులో బిడ్డలను కన్నవారికి ఈ సమస్య ఎక్కువ. వీరిలో చర్మం సాగినట్త్లె తిరిగి బిగువుగా మారదు. దీంతో ఇబ్బంది పడుతుంటారు. వీరందరికీ రొమ్ముల సైజు తగ్గించేందుకు వేరే మార్గాలేం లేవు. సర్జరీనే ఉపయోగపడుతుంది.
ఏ వయసులో: సాధారణంగా కాన్పుల తర్వాత.. బిడ్డకు పాలిచ్చిన తర్వాత.. 35, 45 ఏళ్ల తర్వాత ఇది అవసరమవుతుంటుంది.
ఎలా చేస్తారు: చాలావరకూ కోతలన్నీ రొమ్ములను తగ్గించే సర్జరీలాగే ఉంటాయి. కాకపోతే దీనిలో సాగిపోయిన రొమ్ము భాగాలను పైకి బిగువుగా లాగి.. కుట్ల దారంతో రొమ్ములపైన ఉండే పెక్టోరల్‌ కండరానికి కుడతారు. దీంతో రొమ్ములు సాగినట్లుండకుండా బిగువుగా మారతాయి. క్రమేపీ ఆ కుట్లు ఒంట్లో కలిసిపోయి.. రొమ్ము అలా పైకి లాగినట్లుగానే ఉండిపోతుంది. రొమ్ములు మరీ పెద్దగా ఉంటే మాత్రం రొమ్ము కణజాలాన్ని కూడా కొంత తగ్గిస్తారు.


సర్జరీ తర్వాత..?: అంతా రొమ్ము తగ్గించే సర్జరీలాగే ఉంటుంది.
సైజు తగ్గించటం (బ్రెస్ట్‌ రిడక్షన్‌)
ఎవరికి: కొద్దిమందికి వంశపారంపర్యంగానూ, హార్మోన్ల అసమతౌల్యం కారణంగానూ.. యుక్తవయసులో రొమ్ముల పెరుగుదల చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకోసారి ఒక రొమ్ము సహజంగానే పెరిగి, రెండోది ఎక్కువగా పెరగొచ్చు. వీటివల్ల ఆడపిల్లలు తోటివారి మధ్య, సమాజంలో చాలా నగుబాటుకు గురవుతుంటారు. ఎదుటివారి కళ్లు ముందుగా వీరి ముఖం మీద కంటే రొమ్ముల మీద పడుతుంటాయి. కొన్నిసార్లు పెద్దగా ఉండే రొమ్ముల కారణంగా గూనిలా భుజాల ముందుకు వంగినట్లవటం, వెన్నునొప్పి వంటి బాధలూ వేధిస్తాయి. పెద్దపెద్ద రొమ్ములు ఒకదానితో ఒకటి రుద్దుకుని ఒరుసుకుపోవటం వంటి ఇబ్బందులూ తలెత్తవచ్చు. మరికొన్నిసార్లు- బిడ్డకు పాలిచ్చే సమయంలో రొమ్ముల సైజు పెరిగి.. ఆ తర్వాత తగ్గకుండా అలాగే ఉండిపోతుంది. దీంతో వీరూ ఇబ్బంది పడుతుంటారు. వీరందరికీ రొమ్ముల సైజు తగ్గించే సర్జరీతో మేలు జరుగుతుంది. సౌందర్యం కంటే ముఖ్యంగా ఇది సౌకర్యానికి సంబంధించినది కాబట్టి కొన్ని వైద్యబీమాల కింద కూడా కవర్‌ చేస్తున్నారు.
ఏ వయసులో: సాధారణంగా ఎదిగే వయసు పిల్లలకు.. రొమ్ముల పెరుగుదల ఆగిపోయిన తర్వాత.. అంటే 16-18 ఏళ్ల వయసులో చేస్తారు. మరీ ఎక్కువగా ఉంటే మరికాస్త ముందు చెయ్యచ్చు.
ఎలా చేస్తారు: బాగా యుక్తవయస్సులో ఉన్నవారికి రొమ్ముల సైజు కొద్దిగా తగ్గించాలంటే కేవలం కొవ్వును మాత్రమే తొలగించే 'లైపోసక్షన్‌' చెయ్యచ్చు. మరీ పెద్దగా ఉంటే మాత్రం సర్జరీ చేసి.. రొమ్ములో సాధారణంగా కింది భాగం తొలగిస్తారు. దీనికి రకరకాల పద్ధతులున్నాయి. ప్రధానంగా- కిందికి బాగా జారినట్లుండే చనుమొన భాగాన్ని పైకి తీసుకువెళతారు. అందుకోసం ముందు రొమ్ము పైభాగాన ఒక రంధ్రం ఏర్పాటు చేస్తారు. అప్పుడు చనుమొన నల్లటి వలయం చుట్టూ లోతుగా కోతబెట్టి.. దాన్ని కండ, క్షీరనాళాలు, రక్తనాళాలతో సహా మొత్తాన్ని పైన ఉండే రంధ్రంలోకి మారుస్తారు. అప్పుడు కింది రొమ్ము భాగంలో ఎంతకావాలంటే అంత తగ్గించేసి.. మిగిలిన రెండు అంచులను దగ్గరకు తెచ్చి కుట్టేస్తారు. దీంతో రొమ్ము పరిమాణం తగ్గుతుంది.
సర్జరీ తర్వాత..?: సర్జరీ తర్వాత లోపల రక్తం, స్రావాలు పేరుకోకుండా ఒకరోజు పాటు డ్రైన్‌ గొట్టాలు పెడతారు. 48 గంటల తర్వాత వాటిని తీసేసి బ్యాండేజ్‌ వేసేస్తారు. కొద్దిరోజుల పాటు నొప్పి వంటి చిన్న చిన్న బాధలుంటాయి. ఒకటి రెండువారాల్లో పనులకు వెళ్లిపోవచ్చు. నెలపాటు 'సపోర్టింగ్‌ బ్రా'వాడుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కుట్లు మానిపోయి ఎటువంటి ఇబ్బందులూ ఉండవు.
సమస్యలేమీ ఉండవా?: సాధారణంగా ఎటువంటి సమస్యలూ ఉండవు. కొద్దిమందిలో చిన్నచిన్న ఇన్ఫెక్షన్లు, కుట్ల దగ్గర చర్మం నల్లబడటం, స్రావాల వంటివి రావచ్చు. కొద్దిరోజుల పాటు రొమ్ములు మొద్దుబారినట్లుండొచ్చు. అన్నీకూడా కొద్దిరోజుల్లో సర్దుకుంటాయి.
బిడ్డకు పాలు: సైజు తగ్గించటంలో భాగంగా రొమ్ము కణజాలం, క్షీర గ్రంథుల వంటివాటన్నింటినీ కలిపి కొంత భాగం తొలగించారు కాబట్టి రొమ్ము పెద్దగా ఉన్నప్పటితో పోలిస్తే పాలు కొద్దిగా తక్కువ కావచ్చు, కాబట్టి బిడ్డకు ఎక్కువసార్లు పట్టాల్సి వస్తుంది. అవసరమనుకుంటే పైపాలూ ఇవ్వాల్సి రావచ్చుగానీ ఇది అరుదు.
అబ్బాయిల బాధ (గైనకో మాస్టియా)
ఎవరికి: పురుషుల్లోనూ స్త్రీ హార్మోన్లు ఉంటాయి. కొందరు అబ్బాయిలకు ఎదిగే వయసులో ఈ హార్మోన్ల ప్రభావం ఎక్కువై ఆడపిల్లల్లోలాగే రొమ్ములు పెద్దగా పెరుగుతాయి. కొందరికి ఒకటిరెండు ఏళ్లలో ఆగితే మరికొందరికి 20ల్లో అడుగుపెట్టినా పెరుగుతుంటాయి. అమ్మాయిల మాదిరిగా పెద్దగా రొమ్ములు ఉన్నందుకు టీషర్టుల వంటివి వేసుకోవటానికి ఇబ్బంది పడుతూ.. న్యూనతకు గురవుతుంటారు. వీరికి సర్జరీ బాగా ఉపయోగపడుతుంది.
ఏ వయసులో: సాధారణంగా 18 ఏళ్ల తర్వాత ఎప్పుడైనా చెయ్యచ్చు.
ఎలా చేస్తారు?: కొందరికి రొమ్ముల్లో కేవలం కొవ్వు మాత్రమే పెరిగి.. అవి నొక్కితే చాలా మెత్తగా ఉంటాయి. ఇలాంటి వారికి కేవలం కొవ్వు తొలగించే 'లైపోసక్షన్‌' చేస్తే సరిపోతుంది. కానీ మరికొందరికి రొమ్ము కణజాలం కూడా బాగా ఉండి.. నొక్కితే గట్టిగా కూడా ఉంటాయి. ఇలాంటి వారికి.. లైపోసక్షన్‌తో పాటు కొంత రొమ్ము కణజాలం కూడా తొలగించటం అవసరం. దీనికోసం చనుమొన నల్లటి వలయం అంచుల దగ్గర చిన్నచిన్న కోతలు పెడతారు. వాటి ద్వారా లైపోసక్షన్‌ చేస్తారు. రొమ్ము కణజాలం తొలగించినప్పుడు.. అక్కడ సొట్టల్లా రాకుండా కూడా లైపోసక్షన్‌ ఉపయోగపడుతుంది. సర్జరీ తర్వాత చర్మానికీ, ఛాతీకీ మధ్య ఖాళీ రాకుండా బిగువుగా పట్టి ఉంచేందుకు 'ఛెస్ట్‌ బైండర్‌' అనేది ఇస్తారు. దాన్ని వేసుకుని దానిపైన మామూలుగా బట్టలు తొడుక్కోవచ్చు. అలా ఒక నెల వేసుకుంటే ఎక్కడా తేడా లేకుండా చర్మం చక్కగా అతుక్కుపోతుంది.
మళ్లీ పెరుగుతాయా?: మొత్తం పెరుగుదల అయిపోయిన తర్వాత సర్జరీ చేస్తే మళ్లీ పెరిగే అవకాశం ఉండదు. అలా కాకుండా ముందే చేస్తే మాత్రం ఆ తర్వాత మళ్లీ పెరిగే అవకాశం ఉంటుంది.
అందరికీ...
కోతబెట్టిన చోట మచ్చ త్వరగా కలిసిపోయేందుకు.. అందరికీ కూడా మసాజ్‌ బాగా ఉపయోగపడుతుంది. వారం తర్వాత ఆపరేషన్‌ చేసిన చోట.. ఆ కోత ప్రాంతంలో కొన్ని క్రీములు రాస్తూ మృదువుగా రుద్దితే మచ్చ బాగా తగ్గుతుంది. లింఫ్‌ స్రావాల ప్రవాహం పెరిగి అక్కడ వాపు కూడా ఉండదు. ముఖ్యంగా అక్కడ స్పర్శ చాలా త్వరగా మెరుగవుతుంది.
note: plz leave a comment must who read this... if u dont wish to tell ur name give anonymos comment

Monday, May 25, 2009

పురుషుల ఆరాధ్యుడు.. వయాగ్రా సృష్టికర్త మరణం..




పురుషుల ఆరాధ్యుడు.. వయాగ్రా సృష్టికర్త మరణం..

మగతనం కాపాడుకోలేక... పరువు పోగొట్టుకోలేక దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడే పురుషపుంగవులకు చీకటిలో వెలుగులా.. దారిచూపిన రాబర్ట్ ఫర్చ్ గాట్ పరమపదించారు. సియాటెల్లో తుదిశ్వాస వదిలిన ఫర్చ్ గాట్ వయసు 92 సంవత్సరాలు. వాతావరణానికి హాని చేసే వాయువుగా భావిస్తూ వచ్చిన నైట్రిక్ ఆక్సైడ్ శరీరంలో కీలక ప్రక్రియలక తోడ్పడుతుందని ఈయన తేల్చారు. ఆ కీలక ప్రక్రియల్లో ముఖ్యమైనది కామోద్దీపన. విచిత్రం ఏంటంటే వాతావరణ పరంగా పొగమంచు, ఆమ్లవర్షాలకు కారణమైన నైట్రిక్ ఆక్సైడ్ రక్తప్రసరణ వ్యవస్థలో కీలకంగా పనిచేస్తుందని ఆయన తన పరిశోధనల ద్వారా ప్రపంచానికి నిరూపించారు. ఈ పరిశోధనలే వయగ్రా తయారీకి దోహదపడ్డాయి. ఫర్చ్ గాట్ పుణ్యమా అని ప్రపంచవ్యాప్తంగా లైంగిక సమస్యలతో బాధపడే పురుషులకు వయాగ్రా వరంలా లభించింది. ఈ ఆవిష్కరణతో ఒక్కసారి మగతనం గట్టిగా ఊపిరి పీల్చి గర్వించింది. ఈయన పరిశోధనలకు నోబెల్ పరుగెత్తుకుంటూ వచ్చి ఒడిలో వాలింది
ఓం నమో ఫర్చ్ గాటాయ నమ: